SNP
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీపై భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని ఉదహరిస్తూ.. రోహిత్ చెత్త కెప్టెన్ అంటూ వస్తున్న వ్యాఖ్యలపై స్పందించాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీపై భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని ఉదహరిస్తూ.. రోహిత్ చెత్త కెప్టెన్ అంటూ వస్తున్న వ్యాఖ్యలపై స్పందించాడు.
SNP
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ నిత్యం ఏదో ఒక ఆసక్తికర కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తాజాగా టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఇది జరిగి రోజులు గడుస్తున్నా.. ఇంకా క్రికెట్ అభిమానులను ఆ ఓటమి వెంటాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్.. రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి మాట్లాడాడు. రోహిత్ శర్మ అద్భుతమైన కెప్టెన్ అని, అతని కెప్టెన్సీ సామర్థ్యంపై తనకు ఎలాంటి కంప్లైట్స్ లేవని పేర్కొన్నాడు.
ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్ 2023లో రోహిత్ శర్మ ఎంతో అద్భుతంగా జట్టును నడిపించాడని కితాబిచ్చాడు గంభీర్. కేవలం ఒక్క ఓటమితో రోహిత్ శర్మను చెత్త కెప్టెన్ అని ముద్ర వేయలేమని అన్నాడు. అలా ఎవరైనా రోహిత్ శర్మను చెత్త కెప్టెన్ అని భావిస్తే అది సరికాదని హితవు పలికాడు గంభీర్. నిత్యం ఎవర్నో ఒకర్ని విమర్శిస్తూ కనిపించే గంభీర్ ఇలా.. రోహిత్ శర్మకు మద్దుతుగా నిలవడంపై క్రికెట్ అభిమానుల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీపై కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో గంభీర్ ఇలా సపోర్ట్‌గా నిలవడంపై రోహిత్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
కాగా.. వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్లో టీమిండియా ఓటమి చెందినప్పటికీ.. రోహిత్ శర్మ కెప్టెన్సీపై అంతా సంతృప్తి వ్యక్తం చేశారు. ఫైనల్లో దురదృష్టం కొద్ది టాస్ ఓడిపోవడం ఒక్కటే టీమిండియాను దెబ్బతీసింది. అంతేకానీ, రోహిత్ కెప్టెన్సీ వల్ల కాదు. సిరాజ్ బదులు, షమీని పవర్ ప్లేలో బౌలింగ్‌కు దించడం చిన్న పొరపాటే అయినా.. దాని వల్లే అంత నష్టం జరిగిందని చెప్పలేం. ఏది ఏమైనా.. రోహిత్ శర్మ ఒక మంచి కెప్టెన్. వరల్డ్ కప్‌లో టీమిండియాను ఎదురులేకుండా నడిపించాడు. వరుసగా 10 మ్యాచ్‌ల్లో గెలిపించాడు. కానీ, చివరి మెట్టులో ఓటమి వెక్కిరించింది. ఆ ఓటమి భారత క్రికెట్ అభిమానులను ఎంత బాధించిందో.. అంతకు వంద రెట్లు రోహిత్ శర్మను బాధించి ఉంటుంది. అందుకే.. గంభీర్ చెప్పినట్లు రోహిత్‌ను చెత్త కెప్టెన్ అని ఎవరైనా అంటే అది సమంజసం కాదు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Gambhir said “Rohit has done a very good job as captain, not easy to win 5 IPL, the way India dominated the last WC, before the final, I told the same, whatever be the result in final, India played like champions & one bad game doesn’t make Rohit bad captain – if you call Rohit… pic.twitter.com/JoyOry3FKP
— Johns. (@CricCrazyJohns) December 10, 2023