iDreamPost

పేద విద్యార్థికి గన్నవరం MLA ఆర్థిక సాయం..

పేద విద్యార్థికి గన్నవరం MLA  ఆర్థిక సాయం..

ప్రజాప్రతినిధులు అంటే.. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించే వారు. అయితే నేటికాలంలో చాలా మంది ప్రజాప్రతినిధులు తమ జేబులు నింపుకోవడమే పనిగా పెట్టుకున్నారు. కొందరు మాత్రం..ప్రజల కోసమే పని చేస్తూ ఉంటారు. అలానే కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు పేద వారికి వివిధ రకాల సాయం చేస్తూ.. మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఇటీవలే మంగళగిరి ఎమ్మెల్యే.. రోడ్డు ప్రమాదానికి గురైన వారిని కాపాడి మానవత్వం చాటుకున్నారు. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేద విద్యార్థికి  ఆర్థిక సాయం చేశారు.

విదేశాలకు వెళ్లి.. ఉన్నత విద్య అభ్యసించాలని అనుకున్న ఓ పేద విద్యార్థి  కలను గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్  సాకారం చేశారు. గన్నవరం లోని హనుమాన్ నగర్ కు చెందిన షేక్  నజీర్ బాషాకు యూకే కు చెందిన ప్రసిద్ధి యూనివర్సిటీలో ఎంబీఏ కోర్సు చదివేందుకు  సీటు వచ్చింది. నజీర్ బాషా తండ్రి నాగూర్ వలీ టింకరింగ్ పని చేసుకుంటుూ కుటుంబాన్ని  పోషిస్తున్నాడు. ఆయనకు కుమారుడిని విదేశాల్లో చదివించడం తలకు మించిన భారంగా మారింది. తన కుమారుడిని విదేశాలకు పంపేందుకు తన ఆర్థిక స్థోమత సరిపోదని భావించాడు.  ఈ నేపథ్యంలోనే  హనుమాన్ జంక్షన్ లో జరిగిన వైఎస్సార్ సీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కి స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హాజరయ్యాడు. అలానే ఎమ్మెల్యేను కలిసిన నజీర్ బాషా.. తన సమస్యను వ్యక్తం చెప్పాడు.

దీంతో నజీర్ బాషా కుటుంబ పరిస్థితి, అతని ప్రతిభ గురించి ఆరా తీసిన ఎమ్మెల్యే వంశీ… రెండు లక్షల రూపాయలు ఆర్ధిక సాయం చేశారు. ఈ మొత్తాన్ని స్థానిక వైఎస్సార్ సీపీ ఆఫీస్ లో  పార్టీ నాయకుల చేతుల మీదుగా మంగళవారం నజీర్  బాషాకు అందజేశారు.  ఎమ్మెల్యే వంశీ చొరవతో తన కల తీరబోతుందని నజీర్ బాషా ఆనంద వ్యక్తం చేశారు. విదేశాలకు వెళ్లి చదువుకోలానవి బలంగా ఉన్నప్పటికీ ..తన ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో అది కష్టమని భావించి, ఆందోళన చెందానని నజీర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యే వంశీ గారి సాయంతో తన లక్ష్యం నేరవేరబోతుందని సంతోషం వ్యక్తం చేశాడు. మరి.. పేద విద్యార్థికి గన్నవరం ఎమ్మెల్యే  చేసిన ఆర్థిక సాయంపై మీ అభిప్రాయాలను కామెట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి