iDreamPost

Rahul Singh: సెహ్వాగ్ ను మించిన విధ్వంసం.. డబుల్ సెంచరీతో కదంతొక్కిన హైదరాబాద్ కుర్రాడు!

రాహుల్ సింగ్ గెహ్లాట్.. ప్రస్తుతం రంజీ క్రికెట్ లో మారుమ్రోగుతున్న పేరు. సెహ్వాగ్ ను మించిన విధ్వంసంతో రికార్డు డబుల్ సెంచరీతో కదంతొక్కాడు ఈ హైదరాబాద్ కుర్రాడు.

రాహుల్ సింగ్ గెహ్లాట్.. ప్రస్తుతం రంజీ క్రికెట్ లో మారుమ్రోగుతున్న పేరు. సెహ్వాగ్ ను మించిన విధ్వంసంతో రికార్డు డబుల్ సెంచరీతో కదంతొక్కాడు ఈ హైదరాబాద్ కుర్రాడు.

Rahul Singh: సెహ్వాగ్ ను మించిన విధ్వంసం.. డబుల్ సెంచరీతో కదంతొక్కిన హైదరాబాద్ కుర్రాడు!

వీరేంద్ర సెహ్వాగ్.. ప్రపంచ క్రికెట్ లో ఈ పేరుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఫార్మాట్ ఏదైనా, బౌలర్ ఎవరైనా.. దంచి కొట్టడమే వీరేంద్రుడి పని. టెస్టులను సైతం టీ20ల్లా ఆడటం అతడి నైజం. తాజాగా ఓ యువ బ్యాటర్ అచ్చాం సెహ్వాగ్ లాగే రెచ్చిపోయి ఆడాడు. విధ్వంసకర డబుల్ సెంచరీతో చెలరేగి.. సెహ్వాగ్ ను గుర్తుచేశాడు. ఈ డబుల్ సెంచరీతో దిగ్గజాలకు సైతం సాధ్యం కాని రికార్డును సాధించాడు. ఆ కుర్రాడి పేరు రాహుల్ సింగ్ గెహ్లాట్. హైదరాబాద్ కు చెందిన ఈ కుర్రాడు తాజాగా ప్రారంభమైన రంజీ ట్రోఫీలో తుఫాన్ ఇన్నింగ్స్ తో చెలరేగాడు. దీంతో హైదరాబాద్ జట్టు భారీ స్కోర్ సాధించింది.

రాహుల్ సింగ్ గెహ్లాట్.. ప్రస్తుతం రంజీ క్రికెట్ లో మారుమ్రోగుతున్న పేరు. ఈ హైదరాబాదీ కుర్రాడు తొలి మ్యాచ్ లోనే రికార్డు డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. టీమిండియా మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ లా విధ్వంసం సృష్టించాడు. టెస్టును టెస్టులా కాకుండా వీరూ భాయ్ లా ఆడాడు రాహుల్ సింగ్. రంజీ ట్రోఫీలో భాగంగా నాగాలాండ్ తో జరుగుతున్న తొలి మ్యాచ్ లో రాహుల్ తన విశ్వరూపం చూపాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 143 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాదాడు. దీంతో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ లిస్ట్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు టీమిండియా లెజెండ్ రవిశాస్త్రి. అతడు కేవలం 123 బంతుల్లోనే ద్విశతకం బాదాడు.

ఇక ఈ మ్యాచ్ లో ఓవరాల్ గా 157 బంతుల్లో 23 ఫోర్లు, 9 సిక్సర్లతో 214 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో విధ్వంసక వీరుడు వీరేంద్ర సెహ్వాగ్ తన వేగవంతమైన ద్విశతకాన్ని 168 బంతుల్లో పూర్తి చేసుకోవడం గమనార్హం. సెహ్వాగ్ కంటే తక్కువ బంతుల్లో డబుల్ సెంచరీ బాది ఔరా అనిపించాడు రాహుల్ సింగ్. ఇక ఇతడితో పాటుగా కెప్టెన్ తిలక్ వర్మ(100*), తన్మయ్ అగర్వాల్(80) పరుగులతో రాణించారు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 474 పరుగుల భారీ స్కోర్ చేసింది. మరి సెహ్వాగ్ ను మించి విధ్వంసం సృష్టించిన రాహుల్ సింగ్ బ్యాటింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి