iDreamPost

ఇక్కడ సామాన్యులకు ఉచిత వైద్యం.. ఉదయం 8 గంటల నుండే..

ఈ రోజుల్లో సామాన్యుడికి సరైన వైద్యం దొరకడం అందని ద్రాక్షగా మారింది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఆసుపత్రులకు వెళుతుంటే.. నెల జీతం కూడా సరిపోవడం లేదు. వీటికి తోడు ఆ పరీక్షలు, ఈ టెస్టులు అంటూ మరింత పిండేస్తుంటారు. కానీ.. ఇక్కడ వైద్యంతో పాటు..

ఈ రోజుల్లో సామాన్యుడికి సరైన వైద్యం దొరకడం అందని ద్రాక్షగా మారింది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఆసుపత్రులకు వెళుతుంటే.. నెల జీతం కూడా సరిపోవడం లేదు. వీటికి తోడు ఆ పరీక్షలు, ఈ టెస్టులు అంటూ మరింత పిండేస్తుంటారు. కానీ.. ఇక్కడ వైద్యంతో పాటు..

ఇక్కడ సామాన్యులకు ఉచిత వైద్యం.. ఉదయం 8 గంటల నుండే..

నేడు ప్రతిదీ రూపాయితో ముడిపడి పోయింది. రూపాయి ఉన్నప్పుడే అన్ని చక్కదిద్దుకోవాలి ఆరోగ్యంతో సహా. లేకుంటే.. సంపాదించిన మొత్తం హెల్త్ బాగు చేసుకోవడానికి సరిపోతుంది. ఇళ్లు, పొలాలు, బంగారు నగలు అమ్ముకున్న దాఖలాలు ఉన్నాయి. వైద్యం కమర్షియల్ అయిపోవడంతో చిన్న జ్వరానికే వేలల్లో ఖర్చు అవుతుంది. కన్సల్టెన్నీ ఫీజు, మెడిసన్స్, వైద్య పరీక్షలకు బిల్లు తడిచి మోపుడు అవుతుంది. ఆ ఫీజుకు గడువు వారం పది రోజుల వరకే. మళ్లీ జనరల్ చెకప్ కోసం వెళితే.. సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. దీంతో వెళ్లలేక.. సామాన్యుడు ఆర్ఎంపీ వైద్యులను సంప్రదించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీంతో సామాన్యుడు ఆసుపత్రి మెట్లెక్కేందుకు వెనకాడుతున్నాడు. అలాంటి వారికి ఇలాంటి ఉచిత ఆసుపత్రి ఉందని తెలుసా..?

పేద, మధ్య తరగతి కుటుంబాలకు గత కొన్ని సంవత్సరాలుగా ఓ ఉచిత వైద్యశాల నడుస్తుంది. కేవలం ఉచిత వైద్యమే కాదూ రక్త పరీక్షలు కూడా నిర్వహిస్తారు. ఇది ఎక్కడుదంటే.. విజయవాడ. బెజవాడ మ్యూజియం రోడ్డులో ఉన్న కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజలు ఆరోగ్య సేవ చేయాలన్న ఉద్దేశంతో ఉచిత వైద్య శాలను ఏర్పాటు చేశారు కొందరు. లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. వారికే కాదూ సాధారణ ప్రజలకు కూడా ఈ సేవలు వర్తిస్తాయి. అదనపు ధరలు ఏం తీసుకోకుండా.. స్పెషలిస్ట్ డాక్టర్లైనా గుండె, చెవి, కళ్లు, ముక్కు, చర్మ వైద్య నిపుణులతో ఫ్రీ చెకప్ అండ్ మెడిసన్ అందిస్తున్నారు.

ఈ ఉచిత వైద్యశాలను 1988వ సంవత్సరంలో కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసింది. అప్పటి నుండి సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు లారీ అసోసియేషన్ సభ్యులు, కుటుంబ సభ్యులకు, ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు సామాన్యులకు వైద్య సేవలు అందుతున్నాయి. గుండె, కళ్లు, చెవులకు సంబంధించిన స్పెషలిస్ట్ వైద్యులు ఇక్కడ వైద్యం చేస్తుండటం విశేషం. అందుబాటులో ఉన్న రక్త పరీక్షలు కూడా ఫ్రీగానే నిర్వహిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి