iDreamPost

ధోనిపై పరువు నష్టం కేసు.. చిక్కుల్లో మిస్టర్ కూల్!

Defamation Case On MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కొత్త చిక్కుల్లో పడ్డాడు. అతడిపై పరువు నష్టం దావా వేశారు మాజీ వ్యాపార భాగస్వాములు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Defamation Case On MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కొత్త చిక్కుల్లో పడ్డాడు. అతడిపై పరువు నష్టం దావా వేశారు మాజీ వ్యాపార భాగస్వాములు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ధోనిపై పరువు నష్టం కేసు.. చిక్కుల్లో మిస్టర్ కూల్!

మహేంద్రసింగ్ ధోని.. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించి రికార్డు నెలకొల్పిన కెప్టెన్ గా చరిత్రకెక్కాడు. తన కెరీర్ లో ఎలాంటి గొడవలకు వెళ్లకుండా, వివాదరహితుడిగా ప్రపంచ క్రికెట్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. మైదానంలో ఎంత కూల్ గా ఉంటాడో.. బయటకూడా అంతే ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటాడు ధోని. వివాదాలకు దూరంగా ఉండే ధోనిపై పరువునష్టం దావా వేశారు తన మాజీ వ్యాపార భాగస్వాములు మిహిర్ దివాకర్, సౌమ్యా దాస్. క్రికెట్ అకాడమీలు నిర్మిస్తామని వీరు తనను రూ. 15 కోట్ల మేర మోసం చేశారని ఇటీవలే కోర్టును ఆశ్రయించాడు ధోని. ఈ విషయంపై తాజాగా మిస్టర్ కూల్ ధోనిపై పరువు నష్టం దావా వేశారు ఈ దివాకర్, సౌమ్యా దాస్ లు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చిక్కుల్లో పడ్డాడు. కొన్ని రోజుల క్రితం తన వ్యాపార భాగస్వాములు అయిన మిహిర్ దివాకర్, సౌమ్యా దాస్ లు తన పేరున క్రికెట్ అకాడమీలు నిర్మిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ఇప్పటి వరకు వాటి నిర్మాణాలు ఓ కొలిక్కి రాకపోవడమే కాక.. తనను రూ. 15 కోట్ల మేర మోసం చేశారని బిజినెస్ పార్ట్ నర్స్ అయిన మిహిర్ దివాకర్, సౌమ్యా దాస్ లపై కోర్టులో క్రిమినల్ కేసు వేశాడు ధోని. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉండగా.. ధోనిపై వారిద్దరు పరువు నష్టం దావా వేశారు. ఇందుకు సంబంధించి ఢిల్లీ హైకోర్ట్ ను వారు ఆశ్రయించారు.

dhoni in trouble

ఈ క్రమంలోనే ధోని తమపై తప్పుడు ఆరోపణలు చేశాడని, దీంతో తమ పరువుకు భంగం వాటిల్లిందని తమ పిటిషన్ లో మిహిర్ దివాకర్, సౌమ్యా దాస్ పేర్కొన్నారు. తమ పరువుకు భంగం వాటిల్లినందుకు గాను.. నష్ట పరిహారం చెల్లించాలని తమ పిటిషన్ లో తెలిపారు. అదీకాక తమకు వ్యతిరేకంగా సోషల్ మీడియాల్లో, మీడియాలో ఎలాంటి వార్తలు, ప్రకటనలు రాకుండా నియంత్రించాలని కోర్టును కోరారు. ఇక ఈ కేసును గురువారం(జనవరి 18న) విచారించిన కోర్టు తదుపరి విచారణను జనవరి 29కి వాయిదా వేసింది. సదరు ఫిర్యాదుదారులు వేసిన పిటిషన్ కు సంబంధించి ధోనికి సమాచారం చేరలేదని, ఇది క్రికెటర్ కు అందజేయాల్సిందిగా కోర్టు ఫిర్యాదుదారులను కోరింది. దీంతో విచారణను జనవరి 29కి వాయిదా వేసింది. దీంతో ధోని కొత్త చిక్కుల్లో పడ్డాడు. మరి ధోనిపై పరువు నష్టం దావా వేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి