iDreamPost

రామగిరి బంగారు గనులను పరిశీలించిన అమెరికా బృందం..

రామగిరి బంగారు గనులను పరిశీలించిన అమెరికా బృందం..

కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ ప్రాంతంలో ఒకప్పుడు అపారమైన బంగారు గనులుండేవి. భారత్ గోల్డ్ మైన్స్ అనే సంస్థ ఆ తవ్వకాలు నిర్వహించేది కానీ రాను రానూ గని లోతు పెరుగుతూ పోతుండటంతో దాన్ని వెలికి తీయడానికి ఖర్చు అయ్యేది. మార్కెట్లో బంగారం ధరతో పోలిస్తే ఖనిజాన్ని తవ్వి తీసి..ప్రోసెసింగ్ చేసి మార్కెట్ కు తరలించడానికి అయ్యే ఖర్చు ఎక్కువ అయింది. దీంతో నెమ్మదిగా కోలార్ గోల్డ్ మైన్స్ మూతపడింది. అదే సమయంలో కోలార్ గోల్డ్ మైన్స్ కు అనుబంధంగా భారత్ గోల్డ్ మైన్స్ కు ఏపీలో అనంతపురం జిల్లాలోని రామగిరి మండల కేంద్రంలోని 130 హెక్టార్లలో బంగారు గనులు ఉన్నాయి.

ఇక్కడ ఖనిజం తవ్వితీసి, ప్రాసెసింగ్‌కు అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండేది. దీంతో దాదాపు రెండు దశాబ్దాల కిందట ఇక్కడ తవ్వకాలు ఆపేశారు. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు బంగారం ధరలు పెరగడంతో.. ఆ గనుల్లో ఎంత మేరకు నిల్వలున్నాయి? ఖనిజాన్ని తవ్వి తీస్తే గిట్టుబాటు అవుతుందా? లేదా? తదితర అంశాలను అధ్యయనం చేస్తామంటూ రాష్ట్ర గనులశాఖకు ఆ మధ్య ఎన్‌ఎండీసీ ప్రతిపాదనలు చేసింది. వందల అడుగుల లోతున ఉండే ఈ గనుల నుంచి తవ్వితీసే మట్టిలో టన్నుకు 2-3 గ్రాముల మేర బంగారు ఖనిజం ఉంటుందని అంచనా వేస్తున్నట్టు భావించారు.

రామగిరి గనుల్లో బంగారమైతే ఉందనేది వాస్తవమే కానీ ఎంతమేర ఉండవచ్చు, దానికోసం ఎంత లోతుకు వెళ్లాల్సి ఉంటుంది..ఖర్చు ఎంతవుతుందో అని లెక్కలు వేయడానికి ప్రయ్నతించగా ప్రస్తుతం బంగారం ధరలు పెరగడంతో ఇప్పుడు తవ్వకాలు చేపడితే కచ్చితంగా గిట్టుబాటవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా స్థానిక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అవిరళ కృషి ఫలితంగా రామగిరి బంగారు గనుల్లో బంగారు ఖనిజాన్ని వెలికి తీయడానికి అమెరికా నుంచి ఈ బంగారు వెలికితీత నిపుణులు వచ్చి పరిశీలించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి