iDreamPost

వీడియో: ఫ్లైఓవర్ కింద ఇరుక్కుపోయిన విమానం.. పోలీసులు ఏంచేశారంటే!

సోషల్ మీడియా పుణ్యమా అని మనం ఎన్నడూ చూడని వింతైన ఫోటోలు, వీడియోలు చూసే అవకాశం లభిస్తుంది. కొన్ని వీడియోలు నవ్వులు పూయించే విధంగా ఉంటాయి.. కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉంటాయి.

సోషల్ మీడియా పుణ్యమా అని మనం ఎన్నడూ చూడని వింతైన ఫోటోలు, వీడియోలు చూసే అవకాశం లభిస్తుంది. కొన్ని వీడియోలు నవ్వులు పూయించే విధంగా ఉంటాయి.. కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉంటాయి.

వీడియో: ఫ్లైఓవర్ కింద ఇరుక్కుపోయిన విమానం.. పోలీసులు ఏంచేశారంటే!

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొన్ని ఫన్నీగా ఉంటే.. కొన్ని ఆశ్చర్యం, భయం కలిగించేలా ఉంటున్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అని మనం జీవితంలో చూడలేనీ కనీ వినీ ఎరుగని వీడియోలు చూసే అవకాశం లభిస్తుంది. బీహార్ లో ఓ విచిత్ర ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఓ విమానం ఫ్లై ఓవర్ కింద ఇరుక్కుపోయింది. అదేంటీ.. ఎక్కడైనా విమానం ఆకాశ మార్గంలో ఎగురుతుంది కదా..! మరి భూమిపై ఫ్లైఓవర్ కింద ఎలా ఇరుక్కుపోతుందీ! అన్న అనుమానం వచ్చే ఉంటుంది. నిజమే ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.. వివరాల్లోకి వెళితే..

బీహార్ లోని తూర్పు చంపారణ్ జిల్లాలో ఓ విచిత్ర ఘటన జరిగింది. ఓ భారీ విమానాన్ని లారీ తీసుకువెళ్తుంది. అది కాస్త ఫ్లైఓవర్ వద్దకు రాగానే దానికి కింద ఇరుక్కుపోయింది. ఇటీవల వినియోగంలో లేని విమానాలను వేలం వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ భారీ విమానాన్ని వేలంలో ముంబైకి చెందిన స్క్రాప్ వ్యాపారవేత్త దాన్ని దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే విమానాన్ని అసోంకు పెద్ద లారీలో తీసుకువెళ్లారు. బీహార్ లోని తూర్పు చంపార్ జిల్లాకు విమానం చేరుకుంది. ఆ సమయంలో లారీ డ్రైవర్ ఆలోచనలో పడ్డారు. గోపాల్ గంజ్ లోని ఫ్లైఓవర్ కింద నుంచి ముజఫర్ పూర్ వైపుగా ముందుకు సాగితే.. లారీ అసోం కి చేరుకుంటుంది. లేదంటే ప్రయాణం మరీ దూరం అవుతుందని ఆలోచించి.. ధైర్యం చేసి ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్లాడు. సగానికి పైగా ఫ్లైఓవర్ నుంచి వెళ్లిన లారీ మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో అక్కడ ట్రాఫిక్ అంతరాయం కలిగింది.

ఓ లారీ పెద్ద విమానంతో ఫ్లైఓవర్ కింద ఇరుక్కుపోవడం చూసి వాహనదారులు, జనాలు ఆశ్చర్యపోయారు. తమ సెల్ ఫోన్లలో ఆ సన్నివేశాన్ని వీడియోలు, సెల్ఫీ ఫోటోలు తీసుకున్నారు. మరోవైపు లారీ డ్రైవర్ ఫ్లైఓవర్ నుంచి బయటికి రావడానికి నానా తంటాలు పడ్డాడు. అసలే జాతీయ రహదారి.. ఈ వింత ఘటన చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు.. దీంతో రద్దీ పెరిగిపోయింది. ఈ విషయం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ఎస్‌హెచ్‌వొ మనోజ్ కుమార్ టెక్నికల్ గా అన్ని రకాల ప్రయాత్నాలు చేశారు.. నిపుణులను సంప్రదించారు. ఎస్‌హెచ్‌వొ మనోజ్ కుమార్ టెక్నికల్ గా అన్ని రకాల ప్రయాత్నాలు చేశారు. నిపుణులను సంప్రదించి ఇరుక్కుపోయిన లారీని చాకచక్యంగా బయటకు తీశారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి