iDreamPost

Hrithik Roshan : “వేద” గా వస్తున్న హృతిక్ రోషన్..”విక్రమ్ వేద” ఫస్ట్ లుక్ అదుర్స్!

Hrithik Roshan : “వేద” గా వస్తున్న హృతిక్ రోషన్..”విక్రమ్ వేద” ఫస్ట్ లుక్ అదుర్స్!

బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ నటిస్తున్న క్రైమ్-థ్రిల్లర్ “విక్రమ్ వేద” చిత్రం, 30 సెప్టెంబర్ 2022 న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ సోమవారం ప్రకటించారు. హృతిక్ రోషన్ పుట్టినరోజు సందర్భంగా, ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో అతను “వేద”గా కనిపించనున్నారు.

భారతీయ జానపద కథ ‘విక్రమ్ ఔర్ బేతాల్’ ఆధారంగా, ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ రాధికా ఆప్టే ఓ ప్రధాన పాత్రలో నటిస్తోంది. “విక్రమ్ వేద” పేరుతో తమిళంలో సంచలన విజయం సాధించిన చిత్రానికి ఇది రీమేక్. తమిళ వెర్షన్ లో ఆర్ మాధవన్ మరియు విజయ్ సేతుపతి కలిసి నటించారు. ఇప్పుడు దీనిని బాలీవుడ్ నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి సినిమాని రూపొందిస్తున్నారు.

“విక్రమ్ వేద” తమిళ చిత్రానికి దర్శకత్వం వహించిన పుష్కర్ మరియు గాయత్రి ఈ చిత్రానికి కూడా వాళ్ళే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని గుల్షన్ కుమార్, T-సిరీస్ ఫిల్మ్స్ మరియు రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌లు ఫ్రైడే ఫిల్మ్‌వర్క్స్ మరియు YNOT స్టూడియోస్ ప్రొడక్షన్‌ సమర్పిస్తుండగా, ఎస్ శశికాంత్ మరియు భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి