iDreamPost

విజయవాడలోని అక్కినేని హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం!

Akkineni Women's Hospital: అగ్నిప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వివిధ కారణాలతో జరిగే ఈ ప్రమాదాల్లో ఎంతో మంది అమాయకులు సజీవ దహనం అవుతున్నారు. తాజాగా ఏపీలోని ఓ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది.

Akkineni Women's Hospital: అగ్నిప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వివిధ కారణాలతో జరిగే ఈ ప్రమాదాల్లో ఎంతో మంది అమాయకులు సజీవ దహనం అవుతున్నారు. తాజాగా ఏపీలోని ఓ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది.

విజయవాడలోని అక్కినేని హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం!

ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. షార్ట్ సర్క్యూట్, రసాయనాల పేలుడు, గ్యాస్ లీకేజ్ వంటి ఘటన కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ అగ్నిప్రమాదాల  కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో తీవ్ర గాయాలతో జీవితాన్ని నరకం అనుభవిస్తుంటారు. ఇటీవలే హైదరాబాదా లోని నాంపల్లిలో ఘోర అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఓ అపార్ట్ మెంట్ కింద నిల్వ చేసిన రసాయనాలు పేలి.. పది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలో ఓ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఓ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బెజవాడ నగరంలోని అక్కినేని మహిళా హాస్పిటల్‌ లో అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని పైఅంతస్తులో సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్న రోగులు, వారి సహాయకులు భయాందోళనకు గురయ్యారు.  వెంటనే అప్రమత్తమైన  ఆస్పత్రి సిబ్బంది రోగులకు ఎలాంటి అపాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు,  స్థానికులు అగ్నిమాప కేంద్రానికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎగసి పడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తేవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక ఈ ప్రమాదంలో రోగులకు ఎటువంటి అపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

అయితే, ఈ ప్రమాదం కారణంగా  స్వల్పంగా ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది. షాట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. ఏది ఏమైనా ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో  ఆస్పత్రి వర్గాలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరి.. ఇలా తరచూ అగ్నిప్రమాదా కారణంగా ఎన్నో కుటుంబాలు బుగ్గిపాలు అవుతున్నాయి. గతంలో సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరిగి పలువురు సజీవహ దహనం అయ్యారు. ఓ భవనంలో అయితే ముగ్గురు వ్యక్తులు కాలి బూడిదైయ్యారు. అంతేకాక రెండు రోజుల క్రితం ఓ బస్సులో మంటలు చెలరేగి.. ఒకరు అగ్నికి  ఆహుతి అయ్యారు. మరి.. ఇలాంటి ఘటనలకు నివారణ చర్యలు ఏమిటి?.  మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి