iDreamPost

పూరి గుడిసెలో అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన లక్షల నగదు!

  • Published Mar 11, 2024 | 3:16 PMUpdated Mar 11, 2024 | 3:16 PM

సొంతింటిని నిర్మాణించాలని ఓ పూరి గుడిసెలో ఉండే పేదోడి కల.. కలగానే మిగిలిపోయింది. ఊహించని రూపంలో కష్టం వచ్చి పడటంతో ఆ వ్యక్తి కన్నీటి పర్యంతమయ్యాడు

సొంతింటిని నిర్మాణించాలని ఓ పూరి గుడిసెలో ఉండే పేదోడి కల.. కలగానే మిగిలిపోయింది. ఊహించని రూపంలో కష్టం వచ్చి పడటంతో ఆ వ్యక్తి కన్నీటి పర్యంతమయ్యాడు

  • Published Mar 11, 2024 | 3:16 PMUpdated Mar 11, 2024 | 3:16 PM
పూరి గుడిసెలో అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన లక్షల నగదు!

సొంత ఇళ్లు నిర్మిణం అనేది ప్రతి ఒక్కరి కల. అయితే ఈ కలను సహాకరం చేసుకోవడం అనేది అంతా సులభమైన పని కాదు. ఇందుకోసం ఆర్ధికంగా బలంగా ఉండాలి. కానీ, అందరికి ఇది సాధ్యమైయ్యే పని కాదు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలైతే ఇళ్లు నిర్మించడం కోసం బ్యాంకు నుంచి లోన్ లు పెడుతు ఎలాగోలా వారి కలను సహాకరం చేసుకుంటారు. అయితే, పేదవాడి విషయానికి వస్తే.. ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే రెక్కాడితే డొక్కాడని బ్రతుకులతో..బ్రతుకు జీవనాన్ని లాగించడమే చాల కష్టమైనది. మరి అలాంటి వారు తమ ఆశలను కలలు కనడం తప్ప.. నెరవెర్చుకోలేరు. కానీ, తాజాగా ఓ పేద కుటుంబం మాత్రం చాలా కష్టపడి దాచుకున్న నగదుతో సొంత ఇళ్లును నిర్మించుకోవలని ఆశ పడింది. అయితే ఆ పేదవాడి సొంతింటి కల పూర్తిగా బుడిదపాలైంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

సొంతింటిని నిర్మాణించాలని ఓ పూరి గుడిసెలో ఉండే పేదోడి కల.. కలగానే మిగిలిపోయింది. కష్టపడి రూపాయికి, రూపాయి కూడేసి ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టాడమే కాకుండా.. తెలిసిన వారి వద్ద నుంచి రూ. 4 లక్షలు అప్పుడ కూడా తెచ్చి గుడిసెలో దాచుకున్నడు. అయితే ఊహించని క్రమంలో అతడి కలను అగ్ని ప్రమాదం చిదిమేసింది. ప్రమాదవశాత్తు చోటు చేసుకున్న అగ్నిప్రమాదం వలన గుడిసెలో ఉండే డబ్బు, బంగారం మొత్తం తగలబడిపోయింది. ఈ ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో జరిగింది. గిర్నిబావి గ్రామానికి చెందిన రాయపురి నర్సయ్యకు చెందిన పూరి గుడిసె ఆదివారం తెల్లవారుజామున దగ్ధమైంది. అయితే ఈ ప్రమాదంలో ఇంటి సామగ్రితో పాటు రూ.4 లక్షల నగదు, 5 తులాల బంగారు నగలు, 400 గ్రాముల వెండి ఆభరణాలు కాలి బూడిదయ్యాయి. పైగా కొత్త ఇంటి నిర్మాణం కోసం అప్పుగా తెచ్చిన రూ.4 లక్షలు కూడా ఆ గుడిసెలో పెట్టడంతో అవి పూర్తిగా కాలిపోయాయి. మొత్తం రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు.

ఇక సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. కాగా,బాధిత కుటుంబ సభ్యులను ఆదివారం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి, జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ ఆకుల శ్రీనివాస్‌ తదితరులు పరామర్శించారు.మరి, సొంతిటిని నిర్మించుకోవాలని కలలు కన్న ఆ వ్యక్తికి ఆగ్ని ప్రమాదం రూపంలో మరింత కష్టన్ని తెచ్చిపెట్టిన ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి