iDreamPost

Kali Movie Controversy : ‘కాళి’ పోస్టర్ పై హిందూ సంఘాలు ఎందుకు మండిప‌డుతున్నాయి?

Kali Movie Controversy : ‘కాళి’ పోస్టర్ పై హిందూ సంఘాలు ఎందుకు మండిప‌డుతున్నాయి?

ఈ పోస్ట‌ర్ పెద్ద వివాదాన్నే రేపింది. పోస్టర్‌లో ఒక మహిళ అమ్మవారి వేషధారణలో సిగ‌రెట్ తాగుతూ క‌నిపిస్తుంది.LGBT జెండా వెనుక‌నుంది.

ఇది ప్రొడ్యూస‌ర్ లీనా మణిమేకలై రూపొందించిన డాక్యుమెంటరీ పోస్టర్. కాళీ దేవిని చూపించిన తీరుపై సోషల్ మీడియాలో ఉద్రేకం క‌నిపిస్తోంది. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉంద‌ని ప్రొడ్యూస‌ర్ మీద పోలీసుల‌కు కొంద‌రు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పోలీసులకు, హోం మంత్రిత్వ శాఖకు “గౌ మహాసభ” అధినేత అజయ్ గౌతమ్ ఫిర్యాదు చేశారు. చిత్రనిర్మాతపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని డిమాండ్ చేశారు. అస‌లు ఈ సినిమా రిలీజ్ కాకుండా అడ్డుకోవాల‌ని, నిషేధం విధించాల‌ని కోరారు. సోష‌ల్ మీడియాలో చాలామంది చాలా ఈ పోస్ట‌ర్ పై ఉద్రేక స్వ‌రంతో పోస్టులు చేస్తున్నారు. డాక్యుమెంటరీ వ‌చ్చేవ‌ర‌కు ఆగేలా లేరు.
.
టొరంటోలో ఉంటున్న‌ లీనా మణిమేకలైది తమిళనాడులోని మధురై. శనివారం తన సినిమా పోస్టర్‌ను షేర్ చేశారు. పోస్టర్‌లో కాళీమాత వేషధారణలో ఓ మహిళ పొగతాగుతున్నట్లుగా ఉంది. LGBT జెండా బ్యాక్ గ్రౌండ్ లో క‌నిపిస్తోంది. ఇది మతానికి సంబంధించిందికాదని అంటున్న లీనా, నాకు పోయేదేమీలేదు. ఉన్నంత వరకు దేనికీ భయపడకుండా, మాట్లాడ‌తాను. దానికి మూల్యం ప్రాణ‌మే అయితే ఇస్తాన‌ని సోషల్ మీడియాలో దాడులపై లీనా మణిమేకలై ట్వీట్ చేశారు. రిథమ్స్ ఆఫ్ కెనడాలో భాగంగా ఈ పోస్ట‌ర్ ను లీనా రిలీజ్ చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి