iDreamPost

చనిపోయిన వారిని బాబు ఖాతాలోకి? ఇదేమి రాజకీయం?

చనిపోయిన వారిని బాబు ఖాతాలోకి? ఇదేమి రాజకీయం?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు  స్కీల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఈ నెల 8వ తేదీన చంద్రబాబు అరెస్ట్ సీఐడీ చేసింది. ఆ తరువాత ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇలా స్కీల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబును అధికారులు విచారిస్తుంటే.. టీడీపీ నేతలు, ఎల్లో మీడియా మాత్రం శవల కోసం వెతుకులాడుతుందని టాక్ వినిపిస్తోంది. వివిధ కారణాలతో చనిపోయిన వారిని చంద్రబాబు అరెస్ట్ ను తట్టుకోలేక గుండెలు ఆగి చనిపోయారంటూ ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తోన్నారని తెలుస్తోంది. ఏ విధంగా చనిపోయినా కూడా చంద్రబాబు ఖాతాలోకి వేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

ఏపీ  ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ శవాల అన్వేషణలో బిజీగా ఉందని, ఎక్కడైనా ఎవరైనా అనారోగ్య సమస్యలతో  మంచం ఎక్కారని తెలిస్తే అక్కడ వాలిపోతున్నారని కొందరు అంటున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి.. ఆందోళన చేస్తారని టీడీపీ నేతలు అనుకున్నారని,  అటువంటి స్పందన ప్రజల నుంచి రాకపోవడంతో వ్యూహం మార్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  కొత్త వ్యూహంలో భాగంగా ఏ ఊళ్లోనైనా  పాత జబ్బులతో ప్రాణాలు వదిలితే .. బాబు అరెస్ట్  వార్తను టీవీల్లో  చూసి.. తట్టుకోలేక గుండె పగిలి చనిపోయారంటూ  ప్రచారం చేస్తున్నారంట.

ఏలూరు జిల్లాలో పేరంపేట గ్రామానికి చెందిన భీమడోలు వెంకయ్య గుండె సంబంధిత సమస్యలతో ఈ నెల 10న మృతి చెందారు. ఈ విషయం తెలిసిన టీడీపీ అనుకూల మీడియాలో చంద్రబాబు ఖాతాలో వేశారు. పోలవరం నియోజకవర్గంలో ఎర్రంపేట గ్రామానికి చెందిన పిచ్చి లింగం రెండు కిడ్నీలు పాడైపోవడంతో చాలా కాలంగా మంచంపై ఉంటూ ఇటీవలే మరణించాడు. పిచ్చి లింగం మరణాన్ని కూడా చంద్రబాబు ఖాతాలో వేశారు. అలానే రెండు రోజుల క్రితం కూడా ఓ వృద్ధురాలు మరణిస్తే.. చంద్రబాబు అరెస్ట్ వార్తలు చూసి తట్టుకోలేక గుండె ఆగినట్లు కథనాలు అల్లించారని కొందరు ఆరోపిస్తున్నారు.

వృద్దాప్యం, దీర్ఘ కాలపు అనారోగ్య సమస్యలతో చనిపోయిన వారిని కూడా టీడీపీ నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం, చంద్రబాబుపై సింపతీ క్రియేటే చేసేందుకు వాడుకోవడం నీచాతి నీచంమని పలువు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమి రాజకీయం రా.. సామీ అంటూ ప్రజలు అసంతృప్తి వ్యక్తం  చేస్తోన్నారు. ఆర్థిక నేరానికి పాల్పడి అభియోగాలతో జైలుకు వెళ్లిన చంద్రబాబు గురించి సామాన్య ప్రజలు ఎందుకు  ప్రాణాలు వదులుతారని వారు నిలదీస్తున్నారు. జనం తమవైపు లేరని తెలిసిన పచ్చనేతలు .. అంతా తమవైపే ఉన్నారని  చాటి చెప్పుకోవడానికి  ఇలా శవాల రాజకీయం చేస్తున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి.. చంద్రబాబుపై సింపతీ రావడం కోసమే ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి