iDreamPost

Team India: టీమిండియాకు ఏంటి ఈ దరిద్రం? గతంలో ఎన్నడూ ఇలా లేదు!

గత కొంతకాలంగా టీమిండియాకు ఓ దరిద్రం పట్టుకుంది. ఇది ఫ్యాన్స్ ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మరి ఆ దరిద్రం ఏంటి? తెలుసుకుందాం పదండి.

గత కొంతకాలంగా టీమిండియాకు ఓ దరిద్రం పట్టుకుంది. ఇది ఫ్యాన్స్ ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మరి ఆ దరిద్రం ఏంటి? తెలుసుకుందాం పదండి.

Team India: టీమిండియాకు ఏంటి ఈ దరిద్రం? గతంలో ఎన్నడూ ఇలా లేదు!

గత దశాబ్ద కాలంగా టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. ఈ విషయంపై ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
దీంతో ఈ ఏడాది జూన్ లో యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికగా జరగబోయే టీ20 వరల్డ్ కప్ ను ఎలాగైనా సొంతం చేసుకొని, టీమిండియా ఫ్యాన్స్ కోరికను నెరవేర్చాలన్న పంతంతో ఉంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు ఊహించని దరిద్రం పట్టుకుంది. గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి కష్టాలు టీమిండియా ఎదుర్కొలేదు. మరికొన్ని నెలల్లో టీ20 వరల్డ్ కప్ లాంటి మెగాటోర్నీ ప్రారంభం కానుండటంతో.. ఇప్పుడు ఈ విషయం ఫ్యాన్స్ ను ఆందోళనకు గురిచేస్తోంది. మరి టీమిండియాకు పట్టిన ఆ దరిద్రం ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళ్దాం పదండి.

జనవరి 11 నుంచి ఆఫ్గానిస్తాన్ టీమ్ తో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది భారత జట్టు. ఇది ముగిసిన వెంటనే ఇంగ్లాండ్ తో ఐదు టెస్టు మ్యాచ్ ల కీలకమైన టోర్నీ ఉంది. ఇక ఈ రెండు సిరీస్ ల తర్వాత క్రికెట్ జాతర ఐపీఎల్ మెగాటోర్నీ ప్రారంభం అవుతుంది. దీంతో టీమిండియా ఆటగాళ్లు తీరికలేని షెడ్యూల్ తో తెగ బిజీగా ఉంటారు. కాగా.. ఐపీఎల్ తర్వాత జూన్ లో టీ20 వరల్డ్ కప్ 2024 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీమిండియాకు దరిద్రం గాయాల రూపంలో పట్టుకుంది. జట్టులో స్టార్ ఆటగాళ్లు గాయపడటం, ఇప్పటి వరకు వాళ్లు కోలుకోకపోవడం ఒక్కింత ఆందోళనకు గురిచేసే అంశం. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ గాయాలపాలైన విషయం తెలిసిందే. వీరు గాయాల నుంచి ఇంకా కోలుకోలేదు.

అదీకాక రిషబ్ పంత్ కారు యాక్సిడెంట్ కు గురికావడం, ఇషాన్ కిషన్ మెంటల్ కండిషన్ తో కొన్ని నెలలు ఆటకు దూరంగా ఉంటాను అని ప్రకటించిన విషయం తెలిసిందే. శ్రేయస్ అయ్యర్ కూడా గాయం బారిన పడి ఇటీవలే జట్టులోకి వచ్చాడు. మరికొందరు ప్లేయర్లు సైతం మధ్య మధ్యలో గాయాలపాలై జట్టులోకి వస్తున్నారు. కీలకమైన టీ20 వరల్డ్ కప్ ముందు ప్లేయర్లు ఇలా గాయాలబారిన పడటం జట్టుకు నష్టం కలిగించే విషయం. సూర్య, పాండ్యా, షమీ లాంటి కీలకమైన ఆటగాళ్లు ఇలా తరచుగా గాయాపడటం భారత జట్టుకు ప్రధాన సమస్యగా దాపురించింది. దీంతో దశాబ్దం తర్వాత ఐసీసీ ట్రోఫీ దక్కించుకోవాలనుకున్న భారత్ కు ఇది ఊహించని ఎదురుదెబ్బనే చెప్పాలి. టీమిండియాకు ఏంటి ఈ దరిద్రం అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. గాయాల నుంచి టీమిండియా ప్లేయర్లు  త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.  మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి