iDreamPost

అల్లు అర్జున్‌ని చూసి వెక్కి వెక్కి ఏడ్చిన అభిమాని.. వీడియో వైరల్

  • Published Mar 16, 2024 | 11:29 AMUpdated Mar 16, 2024 | 12:05 PM

Allu Arjun Fan Emotionalized: హీరోలు అంటే పిచ్చిగా అభిమానించేవారికి హఠాత్తుగా ఆ హీరో కనిపించి దగ్గరకు తీసుకుంటే వాళ్ల ఆనందానికి అవధులు ఉండవు.

Allu Arjun Fan Emotionalized: హీరోలు అంటే పిచ్చిగా అభిమానించేవారికి హఠాత్తుగా ఆ హీరో కనిపించి దగ్గరకు తీసుకుంటే వాళ్ల ఆనందానికి అవధులు ఉండవు.

  • Published Mar 16, 2024 | 11:29 AMUpdated Mar 16, 2024 | 12:05 PM
అల్లు అర్జున్‌ని చూసి వెక్కి వెక్కి ఏడ్చిన అభిమాని.. వీడియో వైరల్

స్టార్ హీరో, హీరోయిన్లకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. తమ అభిమాన హీరో సినిమా వచ్చిందంటే చాలు ఎక్కడలేని సంబరాలు జరుపుకుంటారు. థియేటర్ల వద్ద నానా రచ్చ చేస్తుంటారు.. పాలభిషేకం, స్వీట్లు పంచడం ఇలా ఎన్నో రకాలుగా తమ అభిమానాన్ని చాటుకుంటారు. తన కుటుంబ సభ్యుల కన్నా తాము అభిమానించే హీరో కోసం దేనికైనా సిద్దపడుతుంటారు. తమ అభిమాన హీరో పుట్టిన రోజు వేడుకలు వస్తే రక్తదాన శిభిరాలు, అన్నదానం ఇలా ఎన్నో రకాల పనులు చేస్తుంటారు. అలాంటి తాను ఎంతగానో ఇష్టపడే స్టార్ హీరో కనిపించడం.. దగ్గరి తీసుకోవడంతో ఆ అభిమాని ఆనందానికి హద్దు లేకుండా పోయింది. వివరాల్లోకి వెళితే..

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్. ‘గంగోత్రి’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన బన్నీ తర్వాత దేశముదురు, బన్ని, ఆర్య ఇలా వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఫైట్స్, డ్యాన్స్ తో మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా హీరోగా మారాడు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది. 2021 ఏడాదికి కాను 69 వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నిలిచారు. టాలీవుడ్ లో జాతీయ ఉత్తమ నటుడి విభాగంలో తొలి నటుడు కావడం మరో విశేషం. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప2’ మూవీలో నటిస్తున్నాడు.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ షరవేగంగా జరుగుతుంది.

Allu Arjun is a fan who laughed and cried

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని ఓ హార్డ్ కోర్ ఫ్యాన్ కలిశాడు. హఠాత్తుగా బన్నీని కలవడంతో అభిమాని ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఉక్కిరి బిక్కిరి అయ్యాడు.. అల్లు అర్జున్ ని చూస్తూ వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆ సమయంలో సెక్యూరిటీ వస్తే.. వాళ్లను పక్కకు పంపాడు అల్లు అర్జున్. అభిమాని భుజం పై చేయి వేసి ఓదార్చాడు. దీంతో అతడు మరింత ఉప్పొంగిపోయాడు.. బన్నిని హత్తుకొని మల్లీ ఏడ్చాడు. మొత్తానికి అభిమానిని సంతోష పెట్టి అడ్కడ నుంచి వెళ్లిపోయాడు బన్నీ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసి దట్ ఈజ్ ఐకాన్ స్టార్ అంటూ బన్నీ అభినులు షేర్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి