iDreamPost

విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్లపై పవన్ అక్కసు.. సొంత అభిమాని చురకలు!

విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్లపై పవన్ అక్కసు.. సొంత అభిమాని చురకలు!

ప్రస్తుతం ఏపీలో విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్ ల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసలు ట్యాబులు ఎందుకు ఇచ్చారు అనే విధంగా మాట్లాడిన మాటలు, వేసిన ప్రశ్నలు తిరిగి ఆయనే తగులుతున్నాయి. నిజానికి ప్రభుత్వాన్ని విమర్శించాలి అని చేసిన ప్రయత్నం వృథా ప్రయాస కావడమే కాకుండా.. తిరిగి ఆయన్నే నవ్వుల పాలు చేసే పరిస్థితి వచ్చింది. పవన్ వ్యాఖ్యలు ఎంతలా ఆయనకు నెగెటివ్ అయ్యాయి అంటే.. సొంత అభిమానులే చురకలు అంటిస్తున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ అభిమాని చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నా సందేహాలు నివృతి చేయండి, నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంటూ పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో పోస్టులు పెట్టడం చూశారు. అసలు తనకు అవగాహన లేని విద్యా వ్యవస్థలో వేలు పెట్టి నవ్వులపాలు అవుతున్నారు. పవన్ కావాలనే ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అని సామాన్యులకు కూడా తెలిసిపోయింది. సాధారణ పౌరుల సంగతి పక్కన పెడితే పవన్ కల్యాణ్ సొంత అభిమానులే ఆయన చేసిన పనికి చురకలు అంటిస్తున్నారు. ఎందుకన్నా పిల్లలకు మంచి జరుగుతుంటే ఇలా లేనిపోని ప్రశ్నలు వేస్తావంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కేవలం డబ్బులున్న వాళ్లకి మాత్రమే అందుబాటులో ఉంటుంది అందుకునే డిజిటల్ విద్యా మాధ్యమాన్ని ఏపీ ప్రభుత్వం.. పేద విద్యార్థులకు చేరువ చేసింది. నిజానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి సర్వత్రా ప్రశంసలు లభించాయి. ప్రతి ఒక్కరు పేద విద్యార్థులకు ఇలా ట్యాబ్లు ఇస్తున్నారని సంతోషించారు. కేవలం పాఠశాలల్లోనే కాకుండా.. దానికి అదనంగా ఇంటి దగ్గర విద్యను అభ్యసించేందుకు మంచి ఏర్పాట్లు చేశారంటూ ప్రశంసలు కురిపించారు. కానీ, ఒక్క పవన్ కల్యాణ్ మాత్రం ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంటూ ట్విట్టర్ వేదికగా తన అక్కసును వెళ్లగక్కారు.

పవన్ వేసిన ప్రశ్నలకు వైసీపీ శ్రేణులు, మంత్రులు సమాధానం చెప్పడం సంగతి పక్కన పెడితే.. జనసేన కార్యకర్తలే సమాధానం చెబుతున్నారు. అందులో పవన్ కల్యాణ్ అభిమాని చేసిన ఒక ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. పవన్ వేసిన ప్రశ్నలను కోట్ చేస్తూ అతనే స్వయంగా సమాధానం చెప్పాడు. పిల్లలకు మంచి జరుగుతుంటే ఇలాంటి విధానాలను తప్పుబట్టడం ఏంటన్నా అంటూ రివర్స్ లో పవన్ కల్యాణ్ కే ప్రశ్నలు విసిరాడు. సొంత అభిమానులే ఇలాంటి కామెంట్స్ చేస్తుండటంతో నెటిజన్స్ కు అసలు విషయం అవగతమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం మీద బురద జల్లడం ఆపాలంటూ నెటిజన్స్ సలహాలు ఇస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి