iDreamPost

మేడారం భక్తులకు బిగ్ అలర్ట్.. బంగారం కొనుగోలుకు ఆధార్ కార్డు తప్పనిసరి!

మేడారం భక్తులకు బిగ్ అలర్ట్. సమ్మక్క సారక్కలకు సమర్పించే బంగారం కొనుగోళ్లపై అధికారులు ఆంక్షలు విధించారు. బంగారం కొనుగోలుకు ఆధార్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

మేడారం భక్తులకు బిగ్ అలర్ట్. సమ్మక్క సారక్కలకు సమర్పించే బంగారం కొనుగోళ్లపై అధికారులు ఆంక్షలు విధించారు. బంగారం కొనుగోలుకు ఆధార్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

మేడారం భక్తులకు బిగ్ అలర్ట్.. బంగారం కొనుగోలుకు ఆధార్ కార్డు తప్పనిసరి!

తెలంగాణ కుంభమేళగా మేడారం జాతర ప్రసిద్ధిగాంచింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతర మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. కాగా ప్రారంభానికి ముందుగానే భక్తులు మేడారానికి పోటెత్తుతున్నారు. అన్ని దారులు మేడారానికే పయనమవుతున్నాయి. వనదేవతలుగా కొలువుదీరిన సమ్మక్క సారక్కలను దర్శించుకునేందుకు భక్తులు దేశ నలుమూలల నుంచి మేడారానికి చేరుకుంటున్నారు. మొక్కితే వరాలిచ్చే అడవి తల్లులపై భక్తులకు ఎనలేని విశ్వాసం. భక్తులు తాము కోరిన కోర్కోలు తీరాలని ఎత్తుబంగారాలు, ఎదుర్కోళ్లు సమర్పిస్తుంటారు. ఈ నేపథ్యంలో మేడారం భక్తులపై ఎక్సైజ్ శాఖ అధికారులు ఆంక్షలు విధించారు. బంగారం కొనుగోలుకు ఆధార్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మేడారంలో గుడి లేదు.. విగ్రహం లేదు అయినా ఏమహాత్యమో కానీ ప్రకృతి తల్లులై భక్తులకు ఎనలేని విశ్వాసం. భక్తుల పాలిట కొంగుబంగారమై మేడారం జాతర విరాజిల్లుతున్నది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు భక్తులు కోట్ల సంఖ్యలో హాజరై అమ్మవార్లను దర్శించుకుంటారు. కాగా ఈ ఏడాది మేడారం జాతర ఫిబ్రవరి 21 నుంచి 24వరకు జరుగనున్నది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం భక్తులకు ఏవిధమైన అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లను చేసింది. అయితే మేడారం జాతర అనగానే గుర్తొచ్చేది ముందుగా అమ్మవార్లకు సమర్పించే బంగారమే(బెల్లం). అయితే ఈసారి బంగారం కొనుగోళ్లపై అధికారులు ఆంక్షలు విధించారు. దానికి గల కారణం ఏంటంటే.

మేడారం వెళ్లి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకునే భక్తులకు బిగ్ అలర్ట్. బంగారం కొనుగోలు చేయాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా సమర్పించాలని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో గుడుంబా తయారీని అరికట్టేందుకు అధికారులు గతంలో బెల్లం అమ్మకాలపై నిఘా పెట్టేవారు. అక్రమార్కలు బెల్లాన్ని కొనుగోలు చేసి గుడంబా తయారీ చేయకుండా అడ్డుకునేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ ఏడాది బంగారం కొనుగోళ్లపై ఆంక్షలు విధించారు. మేడారంలో సమ్మక్క సారక్కలకు ఎత్తు బంగారంతో మొక్కులు చెల్లించుకునే భక్తులు బంగారం కొనుగోలుకు ఆధార్ కార్డుతో పాటు ఫోన్ నెంబర్ ను బెల్లం వ్యాపారులకు సమర్పించాలని స్ఫష్టం చేశారు.

బెల్లం కొనుగోలుదారుల నుంచి సేకరించిన ఆధార్ వివరాలను తమకు అందజేయాలని వ్యాపారులకు ఎక్సైజ్‌ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశా రు. దీంతో సమ్మక్క భక్తులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు సడలించాలని అటు భక్తులు ఇటు వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. మరి అమ్మవార్లకు సమర్పించే బంగారం కొనుగోలుపై ఆంక్షలు విధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి