iDreamPost

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సౌమ్యుడైతే.. అరెస్ట్‌లు ఎందుకు జరుగుతున్నాయో..!

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సౌమ్యుడైతే.. అరెస్ట్‌లు ఎందుకు జరుగుతున్నాయో..!

076మున్సిపల్‌ పోలింగ్‌ రోజు బుధవారం మచిలీపట్నంలోని 25వ వార్డులో అనుచరులతో కలసి ఓటు వేసేందుకు పోలింగ్‌ బూత్‌లోకి వెళుతున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. ఒక్కరే వెళ్లాలని సూచించారు. దానికి ఒప్పుకోని కొల్లు రవీంద్ర ఎస్సై, కానిస్టేబుళ్లతో వాగ్వాదానికి దిగారు. ఎన్నికల నిబంధనలు ఒప్పుకోవని వారించిన ఎస్సైన్‌ను తోసివేశారు.

ఈ ఘటన తాలుకూ వీడియో ప్రస్తుతం హల్‌చల్‌ చేస్తోంది. ఎస్సైపై దురుసుగా ప్రవర్తించడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో కేసు నమోదైంది. ఈ రోజు ఉదయం కొల్లును అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. అరెస్ట్‌ చేసి, కోర్టులో హాజరపరిచారు. న్యాయమూర్తి బెయిల్‌ మంజూరు చేశారు.

కొల్లు చేసిన తప్పుపై పోలీసులు చట్ట ప్రకారం తమ విధులు నిర్వర్తించారు. రాజ్యాంగం కల్పించిన బెయిల్‌ హక్కును కొల్లు రవీంద్ర న్యాయస్థానం ద్వారా పొందారు. కేవలం రెండు గంటల వ్యవధిలో అరెస్ట్‌ కావడం, బెయిల్‌ రావడం పూర్తయింది. అయితే కొల్లు రవీంద్ర అరెస్ట్‌పై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నుంచి ఆ పార్టీ ముఖ్యనేతలందరూ మీడియా మందుకు వచ్చారు.

Also Read : టీడీపీని ఆవహిస్తున్నఅసహనం

కొల్లు అరెస్ట్‌ అక్రమమంటూ గగ్గొలు పెట్టారు. అరెస్ట్‌ చేయడం దారుణమంటూ వాపోయారు. బీసీ నేతను అరెస్ట్‌ చేశారని ఎప్పటిలాగే కులం కార్డును వాడారు. నారా లోకేష్, అచ్చెం నాయుడు, పట్టాభిరామ్, సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, కళా వెంకటరావు.. ఇలా నేతలందరూ ప్రకటనలు విడుదల చేశారు. పోలీసులను హెచ్చరించారు, ప్రభుత్వానికి శాసనార్థాలు పెట్టారు.

అధికారం శాశ్వతం కాదని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండంటూ కొల్లు రవీంద్ర హెచ్చరికలు జారీ చేశారు. నారా లోకేష్‌ మాత్రం వివాదరహితుడు, సౌమ్యుడైన కొల్లు రవీంద్రను ప్రభుత్వం అకారణంగా అరెస్ట్‌ చేసిందంటూ చెప్పుకొచ్చారు. కొల్లు రవీంద్ర సౌమ్యుడైతే ఎస్సై పట్ల దురుసుగా ఎందుకు ప్రవర్తిస్తారు..? గత ఏడాది మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కరరావు హత్యకు పథకరచన ఎందుకు చేసారు..? అరెస్ట్‌ నుంచి తప్పించుకుని ఎందుకు పారిపోతారు..? ఇవన్నీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్‌ ఒక సారి ఆలోచించాలి.

పోలీసులు అక్రమంగా కేసు పెట్టారంటూ విమర్శిస్తున్న టీడీపీ నేతలు.. పోలీసుల తీరుపై కోర్టులో న్యాయపోరాటం చేయొచ్చు. వారిని కోర్టు మెట్లు ఎక్కేలా చేయొచ్చు. సస్పెండ్‌ కూడా చేయించొచ్చు. అంతేకానీ మైకందుకుని పోలీసులపై విమర్శలు, హెచ్చరికలు జారీ చేస్తూ అనవసరమైన లొల్లి చేస్తే.. కంఠశోష తప్ప ఆశించిన సానుభూతి రాదు.

Also Read : గుంటూరులో టీడీపీ బరితెగింపు.. దొంగ ఓట్లు అడ్డుకోబోయిన మోదుగులపై దాడి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి