iDreamPost

అదే తీరు : అప్పుడు స‌బ్బం.. ఇప్పుడు అయ్య‌న్న‌

అదే తీరు : అప్పుడు స‌బ్బం.. ఇప్పుడు అయ్య‌న్న‌

అక్ర‌మ వ్యాపారాలు, అక్ర‌మ నిర్మాణాలు, అక్ర‌మ రిజిస్ట్రేష‌న్లు.. ఇటీవ‌ల కాలంలో వెలుగులోకి వ‌స్తున్న తెలుగుదేశం నాయ‌కుల అక్ర‌మ లీల‌లు. వాటిపై చ‌ర్య‌లు తీసుకుంటే మాత్రం ఎక్క‌డి లేని కోపాలు వ‌స్తున్నాయి. అధికారులు త‌మ విధులను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించ‌డ‌మే త‌ప్పు అన్న‌ట్లుగా కొంద‌రు నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అధికారం కోల్పోయిన తెలుగుదేశం నాయ‌కులకు అధికారుల‌పై నోరు పారేసుకోవ‌డం ప‌రిపాటిగా మారింది. కొద్ది రోజుల క్రితం జేసి దివాక‌ర్ రెడ్డి కూడా ఓ పోలీస్ అధికారిపై నోరు పారేసుకుని కేసుల్లో ఇరుక్కున్నారు. ఇక విశాఖ టీడీపీ నేత‌ల తీర‌యితే ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. విశాఖ రాజ‌ధాని ప్ర‌క‌ట‌న‌తో వైసీపీ అక్క‌డ ప్ర‌జ‌ల్లో పాతుకుపోతోంది. స‌హ‌నం కోల్పోతున్న టీడీపీ నేత‌లు అధికారుల‌పై నోరు పారేసుకుంటున్నారు.

విధులు నిర్వ‌ర్విస్తే తిట్లా..?

విశాఖపట్నంలో మాజీ ఎంపీ, టీడీపీ నేత సబ్బం హరి పార్కు స్థ‌లాన్ని ఆక్ర‌మించి నిర్మాణం చేప‌ట్టారు. దీంతో జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చి ఆక్రమణలు తొలగించారు. ఈ సంద‌ర్భంగా జీవీఎంసీ అధికారుల‌ను, ప్ర‌భుత్వాన్ని స‌బ్బం హ‌రి తీవ్రంగా హెచ్చ‌రిం చారు. ఈ నేపథ్యంలో కూల్చిన అధికారులపై సబ్బం హరి రెచ్చిపోయి తిట్ల వర్షం కురిపించాడు. రాస్కెల్ వాడు అని మాట్లాడారు. ఇవి అప్ప‌ట్లో దుమారం రేపాయి. ఈ క్రమంలోనే తన వ్యాఖ్యలపై వెనక్కితగ్గారు సబ్బం హరి. ఒక సామాన్యుడిలా సహనం కోల్పోయి మాట్లాడానని మాజీ ఎంపీ .. ఆవేశంలో తిట్టినందుకు సారీ క్షమించండని అధికారులను కోరారు. ఇక ముందు అలాంటి పదాలు వాడనని.. నన్ను ఇష్టపడే వాళ్లకే చెబుతున్నానని అన్నారు. స‌బ్బం వ్యాఖ్య‌లు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఉద్యోగ సంఘాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. దీంతో స‌బ్బం వెన‌క్కి త‌గ్గి క్ష‌మాప‌ణ‌లు చెప్పారు.

సేమ్ సీన్ రిపీట్

మాజీమంత్రి, టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా తాజాగా మరోసారి బూతు పురాణం అందుకున్నారు. పరుష పదజాలంతో రెవెన్యూ అధికారులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గీతం విద్యా సంస్థలు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకుని కట్టిన అడ్డగోలు నిర్మాణాల్ని తొలగించిన నేపథ్యంలో గీతం కళాశాలలో టీడీపీ నేతలు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ‘చదువు చెప్పే విద్యాసంస్థను కూల్చేస్తారా? పడగొట్టిన వాడెవడండీ. బుద్ధుందా ఆ గాడిద కొడుకులకు.. ఆర్డీవో దగ్గరుండి పడగొట్టాడు. ముందు ఆర్‌డీవో, ఆ నా….. సస్పెండ్‌ చేయాలి’ అంటూ నోటికొచి్చనట్టు మాట్లాడారు. ‘గీతం కాలేజీని ధ్వంసం చేయడమేంటి. అధికారులకు జ్ఞానం లేదా’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘అయ్యన్నా.. నోరు అదుపులో పెట్టుకో’

విధి నిర్వహణలో ఉన్న ఆర్డీవో, తహశీల్దార్లను నోటికొచ్చినట్టు దూషిస్తే సహించేది లేదని ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు హెచ్చరించారు. గీతం విద్యాసంస్థల ఆక్రమణలపై చర్యలు తీసుకున్న రెవెన్యూ అధికారులపై అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యల్ని అసోసియేషన్‌ సహాధ్యక్షుడు పీవీ రత్నం, ప్రధాన కార్యదర్శి సి.చంద్రశేఖరరావు తీవ్రంగా ఖండించారు. యూనియన్‌ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో వారిద్దరూ మాట్లాడుతూ అయ్యన్న నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని.. ఇలా ఉద్యోగుల్ని బెదిరించడం చట్టరీత్యా నేరమన్న విషయం ఓ మాజీ మంత్రికి తెలియకపోవడం గర్హనీయమని అన్నారు. బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదనీ, ఉద్యోగుల మనోభావాల్ని దెబ్బతీసే వారికి సరైన సమాధానం చెబుతామని హెచ్చరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి