iDreamPost

మహిళపై చేయిచేసుకున్న ఐఏఎస్ అధికారి

పట్టణాల్లో గ్రేటర్ కమ్యూనిటీలదే హవా. ఆకాశాన్ని తాకే హార్యాలు అపార్ట్ మెంట్ కల్చర్స్ కు పీక్ స్థాయి. లిఫ్ట్, పార్కింగ్, 24 మంచినీరు, విద్యుత్ సదుపాయం, సెక్యూరిటీ, ఉద్యానవనం, స్విమ్మింగ్ ఫూల్స్ వంటివి ఉంటాయి. అయితే ఎక్కడ సమస్య అనిపించదు కానీ.. లిఫ్ట్ దగ్గరకు వచ్చే సరికి చాలా ఇబ్బందిగా మారుతూ ఉంటుంది

పట్టణాల్లో గ్రేటర్ కమ్యూనిటీలదే హవా. ఆకాశాన్ని తాకే హార్యాలు అపార్ట్ మెంట్ కల్చర్స్ కు పీక్ స్థాయి. లిఫ్ట్, పార్కింగ్, 24 మంచినీరు, విద్యుత్ సదుపాయం, సెక్యూరిటీ, ఉద్యానవనం, స్విమ్మింగ్ ఫూల్స్ వంటివి ఉంటాయి. అయితే ఎక్కడ సమస్య అనిపించదు కానీ.. లిఫ్ట్ దగ్గరకు వచ్చే సరికి చాలా ఇబ్బందిగా మారుతూ ఉంటుంది

మహిళపై చేయిచేసుకున్న ఐఏఎస్ అధికారి

ఇప్పుడు అంతా అపార్ట్ మెంట్ కల్చర్. ఈ కాంక్రీటు జంగిల్‌లో ఎన్ని అంతస్థులు ఉంటాయో లెక్క వేయలేం. ఆకాశాన్ని తాకేంత ఎత్తులో భవనాలు నిర్మితమౌతున్నాయి. గ్రేటర్ కమ్యూనిటీస్ పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ ఆకాశ హర్యాల్లో సకల సదుపాయాలు ఉంటాయి. లిఫ్ట్, పార్కింగ్, 24 మంచినీరు, విద్యుత్ సదుపాయం, సెక్యూరిటీ, ఉద్యానవనం, స్విమ్మింగ్ ఫూల్స్ వంటివి ఉంటాయి. ముఖ్యంగా అన్ని అంతస్థులు ఎక్కి, దిగాలంటే కష్టం కనుక.. వారందరికీ ప్రయాణ మార్గం అయ్యింది లిఫ్ట్. సమస్య మొదలయ్యేది కూడా ఇక్కడే. ఇప్పుడు ఇదే లిఫ్ట్ ఓ మాజీ ఐఏఎస్ అధికారి కోపానికి కారణమై.. మహిళపై చెయ్యి చేసుకునేంత వరకు వచ్చింది. ఇంతకు ఏం జరిగిందంటే..

పెంపుడు కుక్కను లిఫ్ట్‌లో తీసుకెళ్లడంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వ్యతిరేకించడంతో వివాదం మొదలైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో చోటుచేసుకుంది. నోయిడా సెక్టార్ 108లోని పార్క్ లారీట్ సొసైటీలో ఉన్న లిఫ్ట్ లోకి మూతికి రక్షణ కవచం లేకుండా కుక్కను తీసుకురావాడాన్ని మాజీ రిటైర్డ్ అధికారి ఆర్పీ గుప్తా వ్యతిరేకించారు. దీంతో కుక్క యజమానురాలు అతడితో వాగ్వాదానికి దిగింది. వాదన తీవ్ర రూపం దాల్చడంతో.. ఆ మహిళ గుప్తా మొబైల్ ఫోన్ లాక్కొన్ని విసిరేసింది. దీంతో ఉద్రేకానికి గురైన గుప్తా ఆమె చెంపపై చెల్లుమనిపించాడు. ఈ మొత్తం ఘటన సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. దీని మీద పోలీసులకు ఫిర్యాదు అందింది.

పెంపుడు కుక్క మూతికి ఏమీ కట్టి లేకపోవడాన్ని చూసిన ఆయన.. లిఫ్ట్‌లోకి తీసుకురావడంపై ఆమెను ప్రశ్నించాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొనడం.. ఆ తర్వాత ఆమె ఫోన్ లాక్కోవడం, చెంప దెబ్బలు కొట్టడం జరిగిపోయాయి. గొడవ విన్న మహిళా భర్త ఆ ప్రదేశానికిి చేరుకుని రిటైర్డ్ ఉద్యోగిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులు మధ్య గొడవ తారా స్థాయికి చేరుకోవడంతో.. ఘర్షణ అదుపులోకి తీసుకురావడానికి భద్రతా అధికారులు జోక్యం చేసుకోవలసి వచ్చింది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు అయ్యిందని, విచారణ కొనసాగిస్తామని పోలీసులు చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి