iDreamPost

ET : సూర్య సినిమాకు ఎన్ని చిక్కులో

ET : సూర్య సినిమాకు ఎన్ని చిక్కులో

రేపు విడుదల కాబోతున్న సూర్య కొత్త సినిమా ఈటి(ఎవరికి తలవంచడు) తెలుగు రాష్ట్రాల్లో మినిమమ్ సౌండ్ చేయడం లేదు. అసలు రిలీజవుతున్న విషయం సామాన్య జనానికి తెలుసో లేదో అన్నంత వీక్ గా ప్రమోషన్లు జరుగుతున్నాయి. సూర్య స్వయంగా వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినా పెద్దగా ప్రయోజనం కలగలేదు. ప్రధానంగా ఎల్లుండి రాబోతున్న రాధే శ్యామ్ దెబ్బ ఈటి మీద నేరుగా పడుతోంది. ఎలాగూ దానికి ఫిక్స్ అయిన మూవీ లవర్స్ సూర్యని ఛాయస్ గా పెట్టుకోవడం లేదు. చాలా బాగుందనే టాక్ వస్తే అప్పుడు చూద్దాంలే అనే ఆలోచనలో ఉన్నారు. పైగా ఈటి ట్రైలర్ కూడా అద్భుతంగా ఉందనిపించేలా మేజిక్ చేయలేదు.

ఈ నేపథ్యంలో టార్గెట్ పెట్టుకున్న థియేట్రికల్ బిజినెస్ 4 కోట్లను రికవరీ చేయడం ఈటికి అంత సులభం కాదు. రెండో రోజు నుంచి హైదరాబాద్ నగరంలో ఓ అయిదు సింగల్ స్క్రీన్లు మినహాయించి అన్ని హాళ్లలో రాధే శ్యామ్ వేయనుండటం సూర్య మూవీని ప్రభావితం చేస్తుందని ట్రేడ్ అంచనా. అక్కడొకటే కాదు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని సెంటర్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఈటిని నిర్మించింది సన్ పిక్చర్స్. రజనీకాంత్ పెద్దన్న వచ్చింది ఈ సంస్థ నుంచే. దానికి వచ్చిన నష్టాల రికవరీలో భాగంగా డిస్ట్రిబ్యూటర్లకు ఈటిని అడ్జస్ట్ చేసి ఇచ్చారని ఎగ్జిబిషన్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. దీని వల్ల కలిగే ప్రయోజనం టాక్ బాగుంటేనే కలుగుతుంది.

ఇక్కడొకటే కాదు క్రేజ్ ఉన్న తమిళనాడులోనూ ఈటికి ఇబ్బందులు తప్పడం లేదు. వలిమై మూడో వారంలోనూ స్ట్రాంగ్ గా ఉండటంతో చాలా చోట్ల థియేటర్లను కంటిన్యూ చేస్తున్నారు. దానికి తోడు రాధే శ్యామ్ కు ఇవ్వాల్సిన కేటాయింపులు మరో అడ్డంకిగా మారాయి. సూర్యకు ఫాలోయింగ్ గట్టిగా ఉన్నప్పటికీ ఈ అంశాలు ఓపెనింగ్ మీద ప్రభావం చూపించేలా కనిపిస్తోంది. సెంటిమెంట్ ని కాస్త అతిగా చూపించే దర్శకుడు పాండి రాజ్ ఈటిని ఎలా డీల్ చేసి ఉంటారన్న అనుమానం ప్రేక్షకుల్లో లేకపోలేదు. రెండు ఓటిటి బ్లాక్ బస్టర్స్ ఆకాశం నీ హద్దురా, జై భీమ్ తర్వాత థియేటర్లకు వస్తున్న సూర్యకు ఈ పరిస్థితి కలగడం అనూహ్యమే

Also Read : Shruti Haasan : కమల్ తనయ చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్టులు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి