iDreamPost

నీళ్లున్న చెరువు రాత్రికి రాత్రే మాయం.. ఎక్కడంటే?

  • Published Jan 01, 2024 | 11:48 AMUpdated Jan 01, 2024 | 11:48 AM

ఈ మద్య దొంగలు రక రకాల దొంగతనాలతో జనాలను బెంబేలెత్తిస్తున్నారు. ఆ మద్య బిహార్ లో రోడ్డు, బ్రిడ్జీ, రైల్ ఇంజన్ సహా ఎత్తుకెళ్లారు. కొన్ని చోట్ల సెల్ టవర్లు మాయం చేస్తున్నారు.

ఈ మద్య దొంగలు రక రకాల దొంగతనాలతో జనాలను బెంబేలెత్తిస్తున్నారు. ఆ మద్య బిహార్ లో రోడ్డు, బ్రిడ్జీ, రైల్ ఇంజన్ సహా ఎత్తుకెళ్లారు. కొన్ని చోట్ల సెల్ టవర్లు మాయం చేస్తున్నారు.

  • Published Jan 01, 2024 | 11:48 AMUpdated Jan 01, 2024 | 11:48 AM
నీళ్లున్న చెరువు రాత్రికి రాత్రే మాయం.. ఎక్కడంటే?

ఈ మద్య కొంతమంది ఈజీ మనీ కోసం ఎన్నో అక్రమాలకు తెగబడుతున్నారు. ఎదుటి వారికి మాయ మాటలు చెప్పి ఉన్నదంతా దోచుకొని ఉడాయిస్తున్నారు. చైన్ స్నాచింగ్, హైటెక్ వ్యభిచారం, అక్రంగా ఆయుధాల సరఫరా, డ్రగ్స్ వ్యాపారం, భూ కబ్జాలు, బెదిరింపులు ఇలా ఎన్నో రకాల దందాలు చేస్తూ లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. ఎలాంటి నేరస్థులైన సరే చివరికి పోలీసులకు చిక్కిపోతుంటారు. ఈ కాలంలో భూమికి ఉన్న వ్యాల్యూ దేనికి లేదన్న విషయం తెలిసిందే. నగరాలు, పట్టణాలు, గ్రామాలు ఎక్కడైనా సరే గత ఇరవై ఏళ్లుగా భూమికి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది.. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలైనప్పటి నుంచి భూములకు రేట్లు అమాంతం పెరిగిపోయాయి. రాత్రికి రాత్రే ఓ నీళ్ళ చెరువు మాయం అయ్యింది.. ఇది చూసి అక్కడవాళ్లంతా షాక్ కి గురయ్యారు. ఇంతకీ ఏక్కడ ఈ చెరువు మాయం అయ్యిందో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు.. కాదేదీ చోరీలకు అనర్హం అంటున్నారు కొంతమంది కేటుగాళ్ళు. సాధారంగా డబ్బు, నగలు, వజ్రాలు, విలువైన పత్రాలు దొంగతనాలు చేస్తుంటారు.. కానీ ఇక్కడ దొంగలు ఏం చేశారో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. నీళ్లు ఉన్న చెరువునే మాయం చేశారు దుండగులు. రాత్రి నీళ్లతో ఉన్న చెరువు తెల్లవారే సరికి మాయం కావడం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన దర్బంగా జిల్లాలో జరిగింది. గతంలో బీహార్ లో 60 అడుగుల పొడవు ఉన్న బ్రిడ్జీని, రైలు ఇంజన్, చివరికి రోడ్డును కూడా ఎత్తుకెళ్లారు దొంగలు. ఈసారి ఏకంగా ఓ చెరువునే రాత్రికి రాత్రి మాయం చేశారు. అంతేకాదు ఆ స్థలంలో ఓ గుడిసెను వేయడం మరో విశేషం.  దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

 కేటుగాళ్ళు నీటిని మాయం చేసి పూర్తిగా మట్టితో కప్పేసి దర్జాగా గుడిసెను వేశారు. రాత్రి వరకు చెరువులో నీళ్లు ఉన్నాయని.. కానీ రాత్రికి రాత్రి ఏం జరిగిందో కానీ నీటి ఆనవాళ్లు లేకుండా పోయి.. అక్కడ ఓ ఇల్లు కూడా ప్రత్యక్షం కావడం దారుణం అని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని.. ఈ పని చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అక్కడకి చేరుకొని అవాక్కయ్యారు. అయితే ఈ చర్యలకు పాల్పపడింది ఎవరు అన్న విషయం ఇంకా తెలియరాలేదు.. దర్యాప్తు చేస్తున్నామని అంటున్నారు పోలీసులు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి