iDreamPost

గుండెపోటుతో ఇంజనీరింగ్ స్టూడెంట్ మృతి

చిన్న, ముసలి తేడా లేదు.. పేద, ధనిక వ్యత్యాసం అస్సలే లేదు. అలా వచ్చి.. ఇలా తీసుకెళ్లిపోతుంది. నవ్వుతున్న, ఏడుస్తున్నా, ఆవేదనలో ఉన్నా, పడుకున్నా, ఆలోచిస్తున్న వచ్చేసి..

చిన్న, ముసలి తేడా లేదు.. పేద, ధనిక వ్యత్యాసం అస్సలే లేదు. అలా వచ్చి.. ఇలా తీసుకెళ్లిపోతుంది. నవ్వుతున్న, ఏడుస్తున్నా, ఆవేదనలో ఉన్నా, పడుకున్నా, ఆలోచిస్తున్న వచ్చేసి..

గుండెపోటుతో ఇంజనీరింగ్ స్టూడెంట్ మృతి

మనిషి జీవన ప్రమాణాలు, ఆహారపు అలవాట్లలో మార్పులు చోటుచేసుకుంటున్నట్లే.. ఆరోగ్యం విషయంలో కూడా డ్రాస్టిక్ట్ ఛేంజెస్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా అనంతర పరిస్థితులు.. సగటు మానవుడి ఆరోగ్య పరిస్థితిని దిగజార్చేస్తున్నాయి. అదే ఇప్పుడు గుండె నొప్పులకు కారణమౌతుంది. చిటుక్కున ప్రాణం పోతుంది. చిన్నలేదు, పెద్దా అనే తారతమ్యం పక్కన పెడితే.. ఒంట్లో నలతగా కూడా కనిపించడం లేదు.  కానీ హార్ట్ ఎటాక్ చంపేస్తుంది. ఆనందంలో.. దు:ఖంలోనో ఉండనక్కర్లేదు.. చిన్న ఆలోచన చేస్తున్నా హరించేస్తుంది. ఆడుతుండగా చిన్నారుల్ని, డ్యాన్స్ చేస్తుంటే.. యువకుల్ని, మంచంలో కూర్చుని ఆలోచన చేస్తున్న మధ్య వయస్కుల్ని, కాటికి చాపే ముదసలి వాళ్లను కూడా బలి తీసుకుంటుంది.

తాజాగా బీటెక్ చదువుతున్న విద్యార్థిని గుండె పోటుతో మరణించింది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలంలోని భామిని (బి) గ్రామానికి చెందిన నార్వాడే వెంకట రావు కూతురు హాసిని హైదరాబాద్‌లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. తండ్రి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కాగా, హాసిని ఆరోగ్యం బాగోకపోవడంతో ఇటీవల ఇంటికి వచ్చింది. గురువారం రాత్రి గుండెల్లో కాస్త నొప్పిగా అనిపించడంతో.. కుటుంబ సభ్యులు నిర్మల్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హాసిని మరణించింది. కూతురి మరణ వార్త విని తండ్రి ఒక్కసారిగా తల్లడిల్లిపోయాడు. చిన్న వయస్సులోనే గుండె పోటు రావడంతో కన్నీరు మున్నీరు అయ్యారు కుటుంబ సభ్యులు.

ఇటీవల కాలంలో ఈ హార్ట్ ఎటాక్ కారణంగా చనిపోతున్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. మొన్నటి మొన్న ఓ బస్సు డ్రైవర్.. విధుల్లో ఉండగానే గుండె పోటుకు గురయ్యాడు.  అతడు అప్రమత్తమై.. వాహనాన్ని నిలిపివేయడంతో.. బస్సులో ఉన్న ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. అలాగే ఓ చిన్నారి కూడా తిరుపతిలో మొక్కు తీర్చుకుని ఇంటికి చేరుకుంటుండగా.. ఈ మాయదారి మహమ్మారి బలి తీసుకుంది. చిన్న వయస్సులోనే నూరేళ్లు నిండిపోవడంతో కన్నీరుమున్నీరు అయ్యారు తల్లిదండ్రులు. సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా హార్ట్ ఎటాక్ కారణంగా  చనిపోయిన సంగతి విదితమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి