iDreamPost

Enemy Movie Report : ఎనిమి సినిమా రిపోర్ట్

Enemy Movie Report : ఎనిమి సినిమా రిపోర్ట్

ఒకప్పుడు పందెం కోడి లాంటి మాస్ ఎంటర్ టైనర్స్ తో తెలుగులో మంచి ఇమేజ్ తెచ్చుకున్న విశాల్ తర్వాత ఒకటి రెండు హిట్లు తప్ప వరస ఫ్లాపులు అందుకోవడంతో మార్కెట్ తగ్గింది. తిరిగి అభిమన్యుడుతో కొంత కోలుకున్నట్టు అనిపించినా ఆ మధ్య వచ్చిన చక్ర తీవ్రంగా నిరాశపరిచింది. నిన్న పెద్దన్న, మంచి రోజులు వచ్చాయితో పాటుగా విడుదలైన ఎనిమి మీద తెలుగులో పెద్దగా అంచనాలు లేవు. టీమ్ మొత్తం హైదరాబాద్ కు వచ్చి ప్రత్యేకంగా ప్రమోషన్లు చేసినప్పటికీ ఇంగ్లీష్ టైటిల్, ట్రైలర్ లో మాస్ కి కనెక్ట్ అయ్యే అంశాలు తక్కువగా ఉన్నట్టు అనిపించడం లాంటి కారణాల వల్ల ఓపెనింగ్స్ వీక్ గా వచ్చాయి. మరి సినిమా ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం.

సూర్య(విశాల్) రాజీవ్(ఆర్య) చిన్నప్పటి నుంచే స్నేహితులు. ఇద్దరినీ పోలీస్ ఆఫీసర్లను చేయాలనే లక్ష్యంతో పారి(ప్రకాష్ రాజ్) శిక్షణ ఇస్తూ ఉంటాడు. వీళ్ళలో రాజీవ్ ఆయన స్వంత కొడుకు. కానీ ఈ జంట త్వరగా విడిపోయే పరిస్థితి వస్తుంది. కొన్నేళ్ల తర్వాత సింగపూర్ లో రాజీవ్ నేరస్తుడిగా ఎదిగితే అతన్ని పట్టుకునే మిషన్ తో అక్కడికి వస్తాడు సూర్య. ఇది కాస్తా శత్రుత్వానికి దారి తీస్తుంది. ఒకళ్ళనొకరు క్యాట్ అండ్ మౌస్ గేమ్ తరహాలో ఎత్తులు పైఎత్తులు వేసుకుంటారు. మరి ఫ్రెండ్స్ ఎనిమిస్ గా మారడానికి దారి తీసిన సంఘటనలు, రాజీవ్ అలా ఎందుకు మారాడు. చివరికి ఎవరు గెలిచారు లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ కథ.

విక్రమ్ ఇంకొక్కడు, విజయ్ దేవరకొండ నోటా తీసిన ఆనంద్ శంకర్ ఈ ఎనిమికి దర్శకుడు. యాక్షన్ ఎపిసోడ్ల విషయంలో తీసుకున్న శ్రద్ధ స్క్రీన్ ప్లే మీద దాన్ని గ్రిప్పింగ్ గా నడిపించడంలో చూపించలేకపోవడంతో ఈ సినిమా ఆశించిన స్థాయిలో థ్రిల్ ఇవ్వదు. గ్రాండియర్ ఉంటే లాజిక్స్ తో పని లేదనే తరహాలో కథనం సాగింది. విశాల్ ఆర్యల పెర్ఫార్మన్స్ బాగున్నప్పటికీ వాటిని సరైన దిశలో వాడుకునే కంటెంట్ ఇందులో లేకపోయింది. విశాలే నటించిన యాక్షన్ తరహా పొరపాట్లు ఇందులోనూ జరిగాయి. సినిమా ఎలా ఉన్నా బిల్డప్ యాక్షన్ ఎపిసోడ్లు ఉంటే చాలనుకుంటే ఎనిమిని ట్రై చేయొచ్చు. కాకపోతే పెద్దన్న కంటే నయం అంతే

Also Read : Manchi Rojulochaie : మంచి రోజులు వచ్చాయి రిపోర్ట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి