iDreamPost

దారుణం: వావి వరసలు మరిచి.. 4 నెలలుగా చెల్లెలిపై అత్యాచారం!

దారుణం: వావి వరసలు మరిచి.. 4 నెలలుగా చెల్లెలిపై అత్యాచారం!

సమాజంలో మానవ సంబంధాలు ఎంతగానో దిగజారిపోతున్నాయి. ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నాం అనే విషయాన్నే మర్చిపోతున్నారు. రోజు రోజుకీ కీచకులు, మృగాళ్లు పెరిగిపోతున్నారు. బంధాలు, బంధుత్వానికి విలువ లేకుండా చేస్తున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి విర్రవీగుతున్నారు. అలాంటి ఒక దుర్మార్గుడి గురించే ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. తాను ఏం చేస్తున్నాడు? ఎవరిపై దారుణానికి ఒడిగడుతున్నాడు అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు. అతను దారుణానికి ఒడిగట్టడమే కాకుండా మరొకరితో చేతులు కలిపి చెల్లెలిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా కలిదిండి మండలానికి చెందిన ఐదో తరగతి బాలిక ఎస్సీ వసతిగృహంలో ఉండి చదువుకుంటోంది. ఆమె చదువుకునే హాస్టల్ కి దగ్గర్లోనే చిన్నారి తల్లి సోదరి నివాసముంటోంది. ఆ చిన్నారిని తల్లి అప్పుడప్పుడు వారి ఇంటికి తీసుకెళ్లేది. చిన్నారి పెద్దమ్మకు అబ్రహం(20) అనే కుమారుడు ఉన్నాడు. ఆ మృగాడి కన్ను ఈ చిన్నారిపై పడింది. వరుసకు అన్నయ్య అవుతాడనే విషయాన్నే మర్చిపోయాడు. తన తల్లి లేనప్పుడు కూడా చిన్నారిని ఇంటికి తీసుకొచ్చేవాడు. ఆ విధంగా నాలుగు నెలలుగా ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తానొక్కడే కాకుండా పఠాన్ ఖాదర్ ఖాన్ అనే వ్యక్తితో కలిసి సామూహిక అత్యాచారానికి కూడా పాల్పడ్డాడు.

ఇటీవల హాస్టల్ కు వెళ్లి చిన్నారిని ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆమె రాను అని ఏడ్చింది. వార్డెన్ నాగమణికి అసలు ఏం జరిగిందనే విషయాన్ని వెల్లడించింది.  వార్డెన్ వెంటనే చిన్నారి తల్లిదండ్రులకు ఈ విషయం తెలియజేసింది. తల్లిదండ్రులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చిన్నారి చదువుకుంటున్న హాస్టల్ వార్డెన్ ను అధికారులు సస్పెండ్ చేశారు. బాధితురాలు చిన్నారిని ఎస్పీ మేరీ ప్రశాంతి కలిశారు. ఆమెతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వావి వరసలు మరిచి మృగంలా ప్రవర్తించిన అబ్రహంపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. అసలు అతను మనిషే కాదంటూ కామెంట్ చేస్తున్నారు. పదేళ్ల చిన్నారిని అలా చేయడానికి అసలు మనసెలా వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి