iDreamPost

ఈనాడు ద్వంద్వ వైఖరకి తాజా నిదర్శనం

ఈనాడు ద్వంద్వ వైఖరకి తాజా నిదర్శనం

జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్పినా, ఏమి చేసినా తప్పుగానే చూసేందుకు ఎల్లోమీడియా ఫిక్సయిపోయిందనే విషయానికి ఇదే నిదర్శనం. కరనా వైరస్ తీవ్రతకు సంబంధించి రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్లుగా గుర్తించాలని జగన్ ప్రధానమంత్రి వీడియా కాన్ఫరెన్సులో చెబితే చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లోమీడియా విరుచుకుపడింది. తర్వాత ఐదు రోజులకు ఇదే విషయాన్ని కులపెద్ద చంద్రబాబునాయుడు ప్రధానికి సూచిస్తే మహాజ్ఞాని చెప్పినట్లుగా ప్రచారం చేసింది ఎల్లోమీడియా.

ఇటువంటిదే తాజాగా మరో విషయం బయటపడింది. వ్యాక్సిన్ను కనుక్కునేంత వరకూ కరోనా వైరస్ తో మనం సహజీవనం చేయాల్సిందే అని జగన్ మూడు రోజుల క్రితం చెప్పాడు. కరోనా సమస్య తీవ్రమైనదేమీ కాదని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని జగన్ అన్నాడు. జగన్ అన్న మాటలకు అర్ధాన్ని పట్టించుకోకుండా చెప్పిన మాటలకు విపరీతార్ధాలు తీసి చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లోమీడియా నానా రచ్చ చేసింది. ఇప్పుడు కూడా జగన్ పై బురద చల్లుతునే ఉంది. విచిత్రమేమిటంటే జగన్ చెప్పిన మాటలకు కాస్త అటు ఇటుగా నరేంద్రమోడికి కూడా ఇదే చెప్పాడు. అలాగే డబ్ల్యుహెచ్ఓ కీలక వ్యక్తులు కూడా ఎప్పటి నుండో ఇదే చెబుతున్నారు.

సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే తాజాగా ఈనాడులో బ్యానర్ కథనం చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. జగన్ మూడు రోజుల క్రితం ఏదైతే చెప్పాడో దాదాపు అదే విషయాన్ని బ్యానర్ కథనంగా అచ్చేసింది. కాకపోతే ఆర్బిఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్, ఇన్పోసిస్ వ్యవస్ధాపకుడు నారాయణ మూర్తి అభిప్రాయాలుగా అచ్చేసింది. జగన్ చెప్పిన విషయాలు తాజాగా రాజన్, నారాయణ మూర్తి చెప్పిన విషయాలు దాదాపు ఒకటే.

అంటే జగన్ చెప్పిన విషయాలు వాస్తవాలు అని తెలిసి కూడా పాజిటి యాంగిల్లో ప్రచురించటానికి ఎల్లోమీడియా ఇష్టపడటం లేదన్న విషయం అర్ధమైపోయింది. జగన్ చెప్పిన విషయాన్నే మరెవరైనా చెబితే మాత్రం ఎటువంటి మొహమాటం లేకుండా ప్రముఖంగా అచ్చేస్తోంది. ఇటువంటి విచిత్రమన పోకడలతోనే ఎల్లోమీడియా ద్వంద్వ వైఖరి బయటపడుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి