iDreamPost

సీతారామం కలెక్షన్లు – ప్రేక్షకుల ఆశీర్వాదాలు

సీతారామం కలెక్షన్లు – ప్రేక్షకుల ఆశీర్వాదాలు

సాఫ్ట్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీతారామంకు ప్రేక్షకుల ఆశీర్వాదాలు దక్కుతున్నాయి. ఒకే రోజు వచ్చిన బింబిసారకు సైతం బ్లాక్ బస్టర్ టాక్ దక్కడం, అందులో మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటం లాంటి కారణాలు ప్రభావం చూపించినప్పటికీ ఏబి సెంటర్లలో సీతారామం రెస్పాన్స్ చాలా బాగుంది. మల్టీప్లెక్సులన్నీ జనంతో నిండిపోయాయి. కంటెంట్ చాలా బాగుంటే ఖచ్చితంగా వెండితెరమీదే చూస్తామని ఆడియన్స్ మరోసారి ఋజువు చేశారు. ముఖ్యంగా ఓటిటిల వల్ల హాళ్లకు దూరమైపోతున్నారనే అభిప్రాయంతో ఉన్న ఇండస్ట్రీ పెద్దలకు తెలిసొచ్చేలా మంచి గ్రాఫ్ లో కలెక్షన్లు నమోదవుతున్నాయి. చాలా స్ట్రాంగ్ గా వీకెండ్ ముగిసింది.

అనూహ్యంగా సీతారామంకు మొదటి రెండు రోజుల కన్నా మూడో రోజు ఎక్కుడ షేర్ రావడం గమనార్హం. మాములుగా ఇలా జరగడం చాలా అరుదు. ఇక లెక్కల విషయానికి వస్తే టోటల్ వీకెండ్ ఫిగర్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజామ్ 2 కోట్ల 53 లక్షలు, సీడెడ్ 65 లక్షలు, ఉత్తరాంధ్ర 85 లక్షలు, ఈస్ట్ వెస్ట్ గోదావరిలు కలిపి 95 లక్షలు, గుంటూరు 47 లక్షలు, కృష్ణ 50 లక్షలు, నెల్లూరు 23 లక్షలు, ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల మొత్తం 6 కోట్ల 18 లక్షల దాకా తేలింది. రెస్ట్ అఫ్ ఇండియా నుంచి 60 లక్షలు, ఇతర బాషలు 1 కోటి 55 లక్షలు, ఓవర్సీస్ లో 2 కోట్ల 80 లక్షలు రాబట్టిన సీతారామం వరల్డ్ వైడ్ షేర్ ని 11 కోట్ల 13 లక్షల దగ్గర వారాంతాన్ని పూర్తి చేసింది.

బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే ఇంకో 5 కోట్ల 80 లక్షలకు పైగానే రావాలి. సాధారణంగా ఇలాంటి సాఫ్ట్ జానర్ మూవీస్ కి మాస్ ఆదరణ నెమ్మదిగా ఉంటుంది కాబట్టి ఆ కోణంలో చూస్తే సీతారామం పెర్ఫార్మన్స్ ని బ్లాక్ బస్టర్ కిందే పరిగణించాలి. ఇవాళ సోమవారం నుంచి సహజంగానే డ్రాప్ కనిపిస్తుంది. కానీ అది తీవ్ర స్థాయిలో ఉండకపోవచ్చు. గురు శుక్రవారాలు కొత్త సినిమాలు వచ్చేలోగా వీలైనంత రాబట్టుకోగలిగితే త్వరగా సేఫ్ అవ్వొచ్చు. స్వప్న సినిమా బ్యానర్ పై వైజయంతి మూవీస్ నిర్మించిన సీతారామంకు హను రాఘవపూడి దర్శకత్వం వహించగా దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ల నటనతో పాటు రష్మిక మందన్న పాత్ర హైలైట్స్ లో ఒకటిగా నిలిచింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి