iDreamPost

అల్లం రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి.. ఈ ప్రయోజనాలని మీరే చూస్తారు..

అల్లం రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి.. ఈ ప్రయోజనాలని మీరే చూస్తారు..

చాలా మంది అల్లం ఘాటుగా ఉందని తినరు. వంటల్లో అల్లం వేస్తే ఘాటు ఎక్కువ అవుతుందని భావిస్తారు. అల్లం అనేది ఆరోగ్యానికి మంచి ఔషధం లాంటిది. అల్లాన్ని మనం రోజూ టీలో వేసుకొని తాగొచ్చు. అల్లాన్ని పచ్చిగా తిన్నా, తేనెతో కలిపి తిన్నా మంచిదే. అల్లంతో పచ్చడి, నిలువ పచ్చడి చేసుకోవచ్చు. అల్లం చాలా ఘాటుగా ఉంటుంది. కాబట్టి చిన్న పిల్లలతో మామిడి అల్లం అయినా తినిపించవచ్చు. అల్లాన్ని ఇలా రోజూ ఏదో ఒక రకంగా ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది.

అల్లం మన శరీర జీర్ణశక్తిని పెంచుతుంది. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటివి తొందరగా తగ్గేలా చేస్తాయి. రోజూ ఉదయాన్నే అల్లం టీ తాగితే ఏమైనా గొంతులో ఇన్స్పెక్షన్ లు ఉన్నా పోతాయి. అల్లం మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మధుమేహం ఉన్నవారు రోజూ అల్లం తీసుకుంటే మంచిది, ఎందుకంటే ఇది రక్తంలోని చక్కర స్థాయిని తగ్గిస్తుంది. కీళ్లు, ఆర్థరైటిస్, కండరాలలో నొప్పిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. వికారంగా ఉన్నప్పుడు అల్లం తింటే మంచిది. అజీర్ణ సమస్యను తగ్గిస్తుంది.

అల్లం ఆరోగ్యానికి మరియు మనం అందంగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. అల్లాన్ని చూర్ణంలా చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకుంటే చర్మంపై నల్లని మచ్చలు తగ్గుతాయి. మరియు చర్మంపై ముడతలను తగ్గించి చర్మం ప్రకాశవంతంగా కనబడేలా చేస్తుంది. అల్లం నూనెను వారానికి రెండు సార్లు తలకు రాస్తే చుండ్రు సమస్య తగ్గి జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు మెరిసేలా చేస్తుంది. అల్లం నూనె లేదా అల్లం పొడిని కూడా ఇందుకు ఉపయోగించవచ్చు. ఈ విధంగా అల్లాన్ని మనం ఆహారంలోను, హెయిర్ కేర్ ప్రోడక్ట్ మరియు ఫేస్ ప్యాక్ లాగా కూడా వాడవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి