iDreamPost

ఆ యాప్‌ ఎందుకూ పనికి రాదు అనుకుంది.. అదే ప్రాణాలు కాపాడింది!

ఆ యాప్‌ ఎందుకూ పనికి రాదు అనుకుంది.. అదే ప్రాణాలు కాపాడింది!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మహిళల భద్రత విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటోంది. ఆడవారిపై అగయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. మహిళల రక్షణ కోసం దిశ యాప్‌ను సైతం అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ ద్వారా ఎంతో మహిళలు దుండగుల బారినుంచి బయటపడ్డారు. తాజాగా, కూడా ఓ మహిళ దిశ యాప్‌ ద్వారా తన ప్రాణాలను రక్షించుకుంది. ఎందుకూ పనికి రాదు అని ఆమె అనుకున్న ఆ యాపే ఆమెను కాపాడింది. ఈ సంఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల జిల్లా, రుద్రవరం మండలంలోని పెద్ద కంబలూరుకు చెందిన ఓ మహిళ పొలం పనులకు వెళ్లింది. పొలం పనులు అయిపోయిన తర్వాత ఇంటికి బయలు దేరింది. మార్గం మధ్యలో ప్రసాద్‌ అనే వ్యక్తి ఆమెను వెంటాడాడు. తర్వాత ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డానికి చూశాడు. ఆమె గట్టిగా కేకలు వేయటంతో స్థానికులు అక్కడికి వచ్చారు. ప్రసాద్‌ అక్కడినుంచి పారిపోయాడు. ఇక, బాధిత మహిళ ఈ విషయాన్ని దిశ ఎస్‌ఓఎస్‌కు కాల్‌ చేసి చెప్పింది.

పోలీసులు 10 నిమిషాల్లో అక్కడికి వచ్చారు. అంతేకాదు! సిరివెళ్ల వైపు వెళుతున్న నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిశ యాప్‌ ద్వారా కాల్‌ చేసిన వెంటనే పోలీసులు స్పందించటంపై మహిళ సంతోషం వ్యక్తం చేసింది. రెండు నెలల క్రితం గ్రామ సచివాలయ సిబ్బంది ఒకరు సదరు మహిళకు దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి ఇచ్చారు. దాన్ని ఎలా వాడాలో కూడా వివరించారు. అయితే, ఆ యాప్‌ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని ఆమె భావించింది. కానీ, అదే యాప్‌ తనకు ఇప్పుడిలా ఉపయోగపడటంతో సంతోషపడుతోంది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి