iDreamPost

బావిలో అస్తి పంజరం.. వంద అడుగుల లోతులో పుర్రె! అసలు ఏంటి ఈ క్రైం స్టోరీ!

  • Published Apr 03, 2024 | 5:48 PMUpdated Apr 03, 2024 | 5:48 PM

కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యవసాయ పంజరం, వంద అడుగుల లోతులో పుర్రె లభ్యమవ్వడంతో తీవ్ర సంచలనంగా మారింది. అయితే ఈ అనవాలు నెల రోజుల కిందట తప్పిపోయిన విద్యార్థివే అయి ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యవసాయ పంజరం, వంద అడుగుల లోతులో పుర్రె లభ్యమవ్వడంతో తీవ్ర సంచలనంగా మారింది. అయితే ఈ అనవాలు నెల రోజుల కిందట తప్పిపోయిన విద్యార్థివే అయి ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

  • Published Apr 03, 2024 | 5:48 PMUpdated Apr 03, 2024 | 5:48 PM
బావిలో  అస్తి పంజరం.. వంద అడుగుల లోతులో పుర్రె! అసలు ఏంటి ఈ క్రైం స్టోరీ!

నగరంలో ఈ మధ్య విద్యార్థులకు సంబంధించి వరుస ఆత్మహత్యలు, హత్యలు జరుగుతున్నాయి. అయితే ఈ ఘటనల్లో ఎక్కువ శాతం కాలేజీ చదువుతున్న విద్యార్థులు కావడమే గమన్హారం. ఇక వరుస విద్యార్థులు మరణాల వెనక కారణాలు చదువుల్లో ఒత్తిడి, మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపన చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కొన్ని అయితే.. మరి కొందరు ప్రేమ వ్యవహారాల వలన ఆత్మహత్యలు చేసుకోవడం, హత్యకు గురవ్వడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే తాజాగా కరీంనగర్ లోని డిప్లొమా చదువుతున్న ఓ విద్యార్థి హత్యకు గురవ్వడం నగరంలో పెను సంచలనం రేపింది. అయితే ఆ విద్యార్థి గతనెల మార్చి 1న కాలేజీ నుంచి అదృశమయిన అనంతరం హత్యకు గురయ్యినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తాజాగా మృతుడి శరీర అవయవాలు ఒక్కొక్కటి లభ్యమవ్వడంతో.. ఈ కేసు తీవ్ర సంచలనంగా మారింది.

కరీంనగర్ జిల్ల తిమ్మాపూర్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. కాగా, ఆ మండలంలోని ఓ వ్యవసాయ బావిలో ఆరు రోజుల కింద అస్తి పంజరం లభ్యమైయింది. అలాగే ఈ సోమవారం పుర్రె కూడా బయటపడడంతో.. అది మార్చి 1న కాలేజీ నుంచి అదృశ్యమైన ఓ విద్యార్థినే అని అనుమానాలు కలుగుతున్నాయి. పైగా ఆ విద్యార్థి దుస్తులు ఆధారంగా ఈ నిర్ణయానకి వస్తునన్నారు. అయితే, ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే కానీ.. ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఆ వివరాళ్లోకి వెళ్తే.. భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని దామెరకుంటకు చెందిన ఎనగంటి అభిలాష్ (20) జ్యోతిష్మతి కాలేజిలో డిప్లొమా స్టూడెంట్ గా చదువుతున్నాడు. కాగా, ఈ యువకుడు మార్చి 1న ఫ్రెండ్ బర్త్ డే కోసం స్నేహితులతో కలిసి కరీంనగర్ వెళ్లాడు. అక్కడ బర్త్ డే సెలేబ్రెషన్స్ తర్వాత అభిలాష్ తప్ప మిగతా వారు హాస్టల్ కు వచ్చారు.

ఇక అక్కడికి కొద్దిసేపటికి అభిలాష్ తాను కాలేజీ గేటు వద్ద ఉన్నానని తనని వచ్చి తీసుకుపోవాలని స్నేహితులకు ఫోన్ చేశాడు. ఇక స్నేహితులు గేటు వద్దకు రాగానే అభిలాష్ కనిపించలేదు. పైగా అతడి ఫోన్ స్విచ్ఛాప్ రావడంతో.. వేరే ఫ్రేండ్ దగ్గరకు వెళ్లి ఉంటాడని భావించారు. ఇక తెల్లారినా ఫోన్ ఆన్ కాకపోవడంతో.. ఆచూకీ లేకపోవడంతో అభిలాష్ తల్లిదండ్రులకు మేనేజ్ మెంట్ సమాచారమిచ్చింది. దీంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయాగా అప్పటి నుంచి అభిలాష్ పోలీసులు వెతుకుతున్నారు.ఈ క్రమంలోనే ఓ వ్యవసాయ బావులో.. అనగా జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజికి కొంత దూరంలో గతనెల మార్చి 27న తల లేని ఓ విద్యార్థి అస్తి పంజారం దొరికింది. అయితే విద్యార్థి అభిలాష్ దుస్తులు ఆధారంగా.. అది అతడిదని నిర్ధారణకు రావడం జరిగింది కానీ, సైంటిఫిక్ గా అది అభిలాష్ మృతదేహం అని గుర్తించడానికి డీఎన్ఏ పరీక్షఅవసరం. అయితే తల లేకపోవడంతో ఈ కేసు పోలీసులకు పెద్ద సవాలుగా మారింది.

అయితే, అనుమానాస్పద రీతిలొ మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల కోసం తీవ్రంగా గాలించారు. కాగా, సీఐ స్వామి, ఎస్సై వివిధ కోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టారు. ఇక అస్తి పంజరానికి తల లేకపోవడంతో.. బావి లోపల పడిపోయి ఉంటుందన్న అనుమానంతతో రెండు రోజులు కష్టపడి బావిలో నీటిని పూర్తిగా ఖాళీ చేశారు. దీంతో వందల అడుగుల లోతుల్లో పుర్రె కనిపించింది. ఇక పుర్రె, అస్తి పంజరం శాంపిల్స్ తీసుకున్న ఫోరెన్సిక్ సిబ్బంది హైదారాబాద్ ల్యాబ్ కు పంపించారు. ఇక ఆ రిపోర్డ్ ఆధారంగా మృతుడు అభిలాషా కాదా అనే నిజ నిజాలు వెలుగులోకి రానున్నాయి. మరి, ఈ బావిలో కనిపించిన అస్తి పంజరం, వంద అడుగుల లోతులో పుర్రె లభ్యమయిన ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంంట్స్ రూపంలో తెలియజేయండి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి