iDreamPost

టెస్ట్‌ క్రికెట్‌కు వార్నర్‌ వీడ్కోలు! కీలక ప్రకటన చేసిన వార్నర్‌ వైఫ్‌

  • Published Jul 10, 2023 | 5:48 PMUpdated Jul 10, 2023 | 5:48 PM
  • Published Jul 10, 2023 | 5:48 PMUpdated Jul 10, 2023 | 5:48 PM
టెస్ట్‌ క్రికెట్‌కు వార్నర్‌ వీడ్కోలు! కీలక ప్రకటన చేసిన వార్నర్‌ వైఫ్‌

2024లో టెస్ట్‌ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతానని ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ప్రకటించాడు. కానీ, తాజాగా అతని భార్య కాండీస్ వార్నర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ షాకింగ్‌ పోస్టు పెట్టింది. టెస్ట్‌ క్రికెట్‌ శకం ముగిసిందంటూ వార్నర్‌, పిల్లలతో ఉన్న ఫొటోను షేర్‌ చేసింది. దీంతో వార్నర్‌ అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నాడనే వార్త దావానంలా వ్యాపించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ ఆడుతోంది.

తొలి రెండు టెస్టులను ఆస్ట్రేలియానే కైవలం చేసుకుంది. కానీ మూడో టెస్టులో పటిష్ఠస్థితిలో ఉండి కూడా ఓటమి పాలైంది. అయితే.. ఈ సిరీస్‌లో ఓపెనర్‌గా వార్నర్‌ దారుణంగా విఫలం అయ్యాడు. దీంతో టెస్ట్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు ఇదే సరైన సమయంగా వార్నర్‌ భావిస్తున్నట్లు సమాచారం. అయితే వార్నర్‌ ఇంకా అధికారికంగా రిటైర్మెంట్‌ విషయంపై మాట్లాడక ముందే.. అతని భార్య ఇన్‌స్టాలో పోస్టు చేసి క్రికెట్‌ అభిమానుల్లో కన్ఫ్యూజన్‌ రేపింది.

కాగా.. యాషెస్‌ సిరీస్‌లో ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టుల్లో వార్నర్‌ కేవలం ఒకే ఒక హాఫ్‌ సెంచరీ చేశారు. తొలి టెస్టులో 9, 36, రెండో టెస్టులో 66, 25, మూడో టెస్టులో 4, 1 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలం అయ్యాడు. దీంతో జట్టుకు భారంగా మారాడు. అయితే టీమ్‌ నుంచి ఉద్వాసనకు గురి కాకముందే.. తానే మర్యాద పూర్వకంగా తప్పుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే నేడో రేపో రిటైర్మెంట్‌ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరి వార్నర్‌ టెస్ట్‌ క్రికెట్‌కు దూరం అవుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Mrs Candice Warner (@candywarner1)

ఇదీ చదవండి: రోహిత్ శర్మ కెప్టెన్సీ బాలేదు! గవాస్కర్ షాకింగ్ కామెంట్స్..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి