iDreamPost

మీ అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉన్నా.. 10 వేలు పొందచ్చు.. ఎలాగంటే?

Bank News: అత్యసర పరిస్థితులు అందరికీ వస్తాయి. అయితే అన్నీసార్లు డబ్బు దొరకకపోవచ్చు. అలాంటప్పుడు బ్యాంకుల ద్వారా ఈ ఫెసిలిటీని వాడుకోండి.

Bank News: అత్యసర పరిస్థితులు అందరికీ వస్తాయి. అయితే అన్నీసార్లు డబ్బు దొరకకపోవచ్చు. అలాంటప్పుడు బ్యాంకుల ద్వారా ఈ ఫెసిలిటీని వాడుకోండి.

మీ అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉన్నా.. 10 వేలు పొందచ్చు.. ఎలాగంటే?

అవసరాలు చెప్పి రావు. కానీ, అవి ఎప్పుడు వచ్చినా ఆర్థికంగా సిద్ధంగా ఉండాలి. అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు. కానీ, చిన్న చిన్న జాగ్రత్తలతో కష్ట సమయంలో ఆర్థిక తోడ్పాటును అందుకోవచ్చు. అందుకు బ్యాంకుల్లోనే కొన్ని సదుపాయాలు ఉన్నాయి. బ్యాంకు ఖాతాల్లో మీకు చాలానే ఆప్షన్స్ ఉంటాయి. అది మీరు అకౌంట్ ఓపెన్ చేయబోయే ముందు అడిగి తెలుసుకోవాలి. అలాంటి సదుపాయాలతో మీకు ఆర్థకంగా లబ్ధి చేకూరే ఆస్కారం ఉంటుంది. అందులో ఒకటి బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ అనమాట. ఈ ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి? దాని వల్ల మీకు కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం.

మీరు బ్యాంకు ఖాతా ఓపెన్ చేసే సమయంలో ఓవర్ డ్రాఫ్ట్ గురించి అడిగి తెలుసుకోవాలి. లేదంటే మీకు ఇప్పటికే బ్యాంకు ఖాతా ఉంటే.. దానికి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం వస్తుందేమో బ్యాంకులో ఆరా తీస్తే మంచిది. ఎందుకంటే ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ఉంది అంటే.. కష్టకాలంలో మీకు ఆర్థికంగా ఒక భరోసా ఉన్నట్లే. జన్ ధన్ ఖాతాలకు ఈ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఉంటుంది. అసలు ఈ ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటంటే.. దీనిని ఒక రకమైన లోన్ గా చెప్పచ్చు. మీరు ఎలా అయితే లోన్ తీసుకుని వడ్డీ చెల్లిస్తారో.. అలాగే దీనికి కూడా వడ్డీ ఉంటుంది.

మీరు ఈ ఓవర్ డ్రాఫ్ట్ ని నిర్ధిష్ట సమయంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే అన్నీ రుణాల మాదిరి.. మీరు దీనికోసం ఎలాంటి అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఉంటే.. మీ ఖాతా జీరో అయినా కూడా మీరు డబ్బులు వాడుకోవచ్చు. మీరు ఏటీఎం ద్వారా కూడా ఈ డబ్బును డ్రా చేసుకోవచ్చు. అయితే ఎంత పడితే అంత తీసుకోవడానికి ఆస్కారం ఉండదు. మీకు ఎంత వరకు ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో నగదు ఇవ్వాలి అనేది ముందుగానే నిర్ణయిస్తారు. జన్ ధన్ ఖాతా ఉన్నవారికి మాత్రం ఓవర్ డ్రాఫ్ట్ కింద రూ.10 వేల వరకు లభిస్తుంది. మిగిలిన బ్యాంకులు మీ ఖాతా, మీ ఆర్థిక క్రమశిక్షణ ఇలా పలు కోణాల్లో పరిశీలించి మీకు ఈ ఓవర్ డ్రాఫ్ట్ మొత్తాన్ని నిర్ణయిస్తారు.

కొన్ని బ్యాంకుల్లో ఈ ఓవర్ డ్రాఫ్ట్ ని పొందడానికి మినిమం బ్యాలెన్స్ మెయిన్ టైన్ చేయాల్సి ఉంటుంది. ఇంక ఈ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యానికి సంబంధించి వడ్డీ చూస్తే.. బ్యాంకును బట్టి ఆ వడ్డీ మొత్తం మారుతూ ఉంటుంది. మీకు 2 నుంచి 12 శాతం వరకు బ్యాంకులు ఈ ఓవర్ డ్రాఫ్ట్ రుణంపై వడ్డీని వసూలు చేస్తూ ఉంటాయి. కాకాపోతే 12 శాతానికి మించి మాత్రం వడ్డీని వసూలు చేయరు. అంతేకాకుండా ఈ ఓవర్ డ్రాఫ్ట్ లో ఇంకో సౌకర్యం కూడా ఉంటుంది. మీకు రూ.30 వేలు ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ ఉంది. కానీ.. మీరు అందులో కేవలం రూ.10 వేలు మాత్రమే డ్రా చేశారు. అప్పుడు మీకు ఆ రూ.10 వేలకు మాత్రమే వడ్డీ పడుతుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఓవర్ డ్రాఫ్ట్ అనేది అప్పు. తీసుకునే ముందు కాస్త ఆలోచించుకుని.. అత్యవసరం అయితేనే వాడుకోవాలని మర్చిపోవద్దు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి