iDreamPost

టీమిండియా స్టార్ క్రికెటర్ తండ్రికి బ్రెయిన్ స్ట్రోక్.. పరిస్థితి విషమం!

  • Author Soma Sekhar Published - 07:41 PM, Tue - 5 December 23

టీమిండియా స్టార్ క్రికెటర్ తండ్రి బ్రెయిన్ స్ట్రోక్ తో హస్పిటల్ లో చేరారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో.. ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

టీమిండియా స్టార్ క్రికెటర్ తండ్రి బ్రెయిన్ స్ట్రోక్ తో హస్పిటల్ లో చేరారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో.. ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

  • Author Soma Sekhar Published - 07:41 PM, Tue - 5 December 23
టీమిండియా స్టార్ క్రికెటర్ తండ్రికి బ్రెయిన్ స్ట్రోక్.. పరిస్థితి విషమం!

ఆస్ట్రేలియాతో జరిగిన 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా నాలుగో టీ20 మ్యాచ్ కు జట్టులోకి ఎంట్రీ ఇచ్చి.. అనూహ్యంగా చివరి నామమాత్ర పోరుకు అందుబాటులో లేకుండా పోయాడు ఓ స్టార్ బౌలర్. దానికి కారణం తన తండ్రి అనారోగ్యంతో ఉండటమే. తన తండ్రిని దగ్గరుండి చూసుకుందామని ఇంటికి వచ్చిన ఆ స్టార్ ప్లేయర్ కు అనుకోని సంఘటన ఎదురైంది. అతడి తండ్రి బ్రెయిన్ స్ట్రోక్ కు గురికావడంతో హుటాహుటిన ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

టీమిండియా స్టార్ క్రికెటర్ దీపక్ చహర్ తండ్రి లోకేంద్ర సింగ్ చహర్ బ్రెయిన్ స్ట్రోక్ కు గురైయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే లోకేంద్ర సింగ్ ను అలీగఢ్ లోని మిత్రరాజ్ హాస్పిటల్ లో చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో.. ఐసీయూలో చికిత్స అందిస్తున్నాట్లు సమాచారం. కాగా.. మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి లేదా ఆగ్రాకు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. లోకేంద్ర సింగ్ డయాబెటిస్, హైపర్ టెన్షన్ తో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ కారణంగా ఆయన శరీరం వైద్యానికి సహకరించడం లేదని నివేదికలు చెబుతున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన క్రికెట్ అభిమానులు దీపక్ చహర్ తండ్రి త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు. కాగా.. చహర్ ఆదివారం నాడు బెంగళూరు వేదికగా ఆసీస్ తో జరిగిన 5వ టీ20 మ్యాచ్ ఆడలేదు. నాలుగో మ్యాచ్ లో ఆడి రెండు కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ అనంతరమే మెడికల్ ఎమర్జెన్సీలో భాగంగా ఇంటికి చేరుకున్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి