iDreamPost

Darshan: 7 సంవత్సరాలుగా కనిపించని దర్శన్ మేనేజర్! షాకింగ్ విషయాలు బయటికి..

గత 7 సంవత్సరాలుగా దర్శన్ మేనేజర్ కనిపించట్లేదన్న విషయం తాజాగా వైరల్ గా మారింది. మరి 7 ఏళ్లుగా దర్శన్ మేనేజర్ ఎందుకు పరారీలో ఉన్నాడు? ఆ వివరాలు..

గత 7 సంవత్సరాలుగా దర్శన్ మేనేజర్ కనిపించట్లేదన్న విషయం తాజాగా వైరల్ గా మారింది. మరి 7 ఏళ్లుగా దర్శన్ మేనేజర్ ఎందుకు పరారీలో ఉన్నాడు? ఆ వివరాలు..

Darshan: 7 సంవత్సరాలుగా కనిపించని దర్శన్ మేనేజర్! షాకింగ్ విషయాలు బయటికి..

కన్నడ టాప్ హీరో, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్.. రేణుకస్వామి అనే వ్యక్తి హత్య కేసులో పోలీసుల విచారణ ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో కొన్ని రోజుల  క్రితం అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన ప్రియురాలు పవిత్ర గౌడకు అసభ్యకర మెసేజ్ లు పంపిస్తున్నాడని దర్శన్ తన అనుచరుల సాయంతో రేణుకస్వామిని హత్య చేయించాడని తెలుస్తోంది. ఇక కేసు విచారణలో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత 7 సంవత్సరాలుగా దర్శన్ మేనేజర్ కనిపించట్లేదన్న విషయం తాజాగా వైరల్ గా మారింది. మరి 7 ఏళ్లుగా దర్శన్ మేనేజర్ ఎందుకు పరారీలో ఉన్నాడు? దానికి కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ హత్య కేసులో అరెస్ట్ అయ్యి.. పోలీసు విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. దర్శన్ మేనేజర్ మల్లికార్జున్ గత 7 ఏళ్ల నుంచి కనిపించడం లేదు. ఎవ్వరికీ దొరక్కుండా అతడు తిరుగుతున్నాడు. దర్శన్ దగ్గర 2018 నుంచి పనిచేస్తున్న మల్లికార్జున్.. కన్నడ ఇండస్ట్రీలో అతడి పేరు చెప్పి కోట్ల రూపాయాలు వసూల్ చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. ‘ప్రేమ బరహ’  అనే సినిమా పంపిణీ బాధ్యతను తూగుదీప(దర్శన్ సొంత నిర్మాణ సంస్థ)కు అప్పగించారు. ఈ వ్యవహారలను మల్లికార్జున్ చూసుకున్నాడు.

అయితే ఈ సమయంలో మూవీ హక్కులు విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బులతో మేనేజర్ మల్లికార్జున్ పరార్ అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దర్శన్ కు దొరక్కుండా తిరుగుతున్నాడని అక్కడి వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ ఘటనపై దర్శన్ ఇంతవరకు మల్లికార్జున్ పై కేసు పెట్టలేదని తెలుస్తోంది. దాంతో దర్శన్, అతడి మేనేజర్ పై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇంతకీ మేనేజర్ మల్లికార్జున్ బతికే ఉన్నాడా? లేడా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి