iDreamPost

Cyclone Michaung: మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్.. చెన్నై విమానాశ్రయం మూసివేత!

మిచౌంగ్ తుపానుతో చెన్నై వాసులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఈ తుపాను వల్ల కురుస్తున్న వర్షాలతో చెన్నైలో జనజీవనం స్తంభించి పోయింది.

మిచౌంగ్ తుపానుతో చెన్నై వాసులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఈ తుపాను వల్ల కురుస్తున్న వర్షాలతో చెన్నైలో జనజీవనం స్తంభించి పోయింది.

Cyclone Michaung: మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్.. చెన్నై విమానాశ్రయం మూసివేత!

మిచౌంగ్ తుపాను ప్రజలను వణికిస్తోంది. పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చెన్నై నగరాన్ని మిచౌంగ్ తుపాను అతలాకుతలం చేస్తోంది. తుపాను కారణంగా కురుస్తున్న వర్షాల వల్ల చెన్నై ప్రజల జీవనం దెబ్బతింటోంది. కాలనీలు, ప్రధాన రహదారులు అన్నీ జలాశయాలను తలపిస్తున్నాయి. ఎవరూ బయటకు రావొద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ సేవలకు కూడా అంతరాయం వాటిల్లింది. ఇప్పుడు చెన్నై విమానాశ్రయాన్ని కూడా మూసేశారు. విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించారు.

ప్రస్తుతం మిచౌంగ్ తుపాను కారణంగా చెన్నై ప్రజా రవాణాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లన్నీ వరద నీటితో మునిగిపోయాయి. ఎవరూ కూడా బయటకు రావడం లేదు. ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేశారు. దేశవ్యాప్తంగా తుపాను ప్రభావిత ప్రాంతాలకు రైళ్ల సేవలను నిలిపివేశారు. రోడ్డు మార్గాన కూడా చెన్నైకి రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా జాతీయ రహదారులు కూడా వర్షపు నీటితో నిండిపోయాయి. ఇప్పుడు విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. రన్ వేని క్లోజ్ చేస్తున్నట్లు చెన్నై విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. రాత్రి 11 గంటల వరకు విమానాల టేకాఫ్, ల్యాండింగ్ జరగదని.. రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామంటూ ప్రకటించారు. వాతావరణం అనుకూలించక పోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ తెలియజేశారు. తుపాను ప్రభావం వల్ల తీర ప్రాంతాలైన చెన్నై, కాంచీపురం, తిరువల్లూర్, చెంగలపట్టు ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదు అవుతోంది.

ఈ వర్షాల కారణంగానే విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మిచౌంగ్ తుపాను కారణంగా ప్రస్తుతం 80 నుంతి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. వర్షపు నీటి వల్ల విమానాలు, రోడ్డు రవాణా మాత్రమే కాకుండా.. రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. చెన్నైలో దాదాపు 14 సబ్ వేలను వర్షపు నీటివల్ల మూసివేశారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు, విద్యా సంస్థలకు కూడా సెలవులు ప్రకటింతారు. ఇంక ఈ మిచౌంగ్ తుపాను వల్ల అటు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ తుపాను నెల్లూరు- మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. అలాగే ఇక్కడ ఈదురు గాలులు కూడా వీచే ఆస్కారం ఉంది. ఇప్పటికే ఆంధ్రాలో అధికారులు తీర ప్రాంత జిల్లాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే మరో 28 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.


మరోవైపు మిచౌంగ్ తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలతో రోడ్లు, కాలనీలు అన్నీ జలమయం అయ్యాయి. కొన్నిచోట్ల కాలనీల్లో పార్క్ చేసిన కార్లు కాగితపు పడవల్లా వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి. ఇప్పటికే చెన్నై నగరానికి మంచినీటిని సరఫరా చేసే రిజర్వాయర్లు అన్నీ నిండిపోయాయి. ఇంకా వర్షాలు కురుస్తూ ఉండటంతో అవి పొంగే ప్రమాదం కూడా ఉందంటూ అధికారులు తెలుపుతున్నారు. ఇప్పటికే నెట్టింట చెన్నై నగరానికి సంబంధించిన విజువల్స్ వైరల్ గా మారాయి. అక్కడి ప్రజలు పడుతున్న అవస్థలకు ఆ దృశ్యాలు సాక్ష్యం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఏటా ఇలాంటి వరదలు వస్తున్నా కూడా ఎందుకు ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. 5 సెంటీమీటర్ల వర్షం కురిస్తేనే రోడ్లు జలమయం అవుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి