iDreamPost

నూడుల్స్‌ ప్యాకెట్లలో కోట్ల విలువైన బంగారం, వజ్రాలు

  • Published Apr 23, 2024 | 5:50 PMUpdated Apr 23, 2024 | 5:50 PM

సాధారణంగా ఒక నూడిల్స్ పాకెట్ లో ఏం ఉంటాయి.. నూడిల్స్ , దానికి తగిన మసాలా ప్యాకెట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ వజ్రాలు, బంగారం దర్శనం ఇచ్చాయి. ఈ ఘటన ఎక్కడ జరిగిందో.. అసలు మ్యాటర్ ఏంటో చూసేద్దాం.

సాధారణంగా ఒక నూడిల్స్ పాకెట్ లో ఏం ఉంటాయి.. నూడిల్స్ , దానికి తగిన మసాలా ప్యాకెట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ వజ్రాలు, బంగారం దర్శనం ఇచ్చాయి. ఈ ఘటన ఎక్కడ జరిగిందో.. అసలు మ్యాటర్ ఏంటో చూసేద్దాం.

  • Published Apr 23, 2024 | 5:50 PMUpdated Apr 23, 2024 | 5:50 PM
నూడుల్స్‌ ప్యాకెట్లలో కోట్ల విలువైన బంగారం, వజ్రాలు

నూడిల్స్ ను దాదాపు అందరూ తింటూ ఉంటారు. సాధారణంగా నూడిల్స్ పాకెట్ లో ఉండేది.. నూడిల్స్ తో పాటు దానికి తగిన మసాలా ప్యాకెట్స్. ఇది అందరికి తెలిసిన విషయమే.ఇందులో పెద్ద విశేషం ఏమి లేదు. కానీ ఇక్కడ మాత్రం నూడిల్స్ ప్యాకెట్ లో బంగారం, వజ్రాలు దర్శనం ఇచ్చాయి. నూడిల్స్ పాకెట్ లోకి బంగారం, వజ్రాలు రావడం ఏంటి .. ఇదేదో కట్టుకథ అని అనుకుంటే పొరపాటే, ఎందుకంటే ఈ సంఘటన నిజంగానే జరిగింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ సంఘటన ఎక్కడ జరిగిందో.. దీని వెనుక ఉన్న కథేంటో .. అవి నూడిల్స్ పాకెట్ లోకి ఎలా వచ్చాయో తెలుసుకుందాం.

అయితే, ఏ ఎయిర్‌పోర్టు అయినా కూడా అక్కడ ప్రయాణించే ప్రయాణికులను.. కస్టమ్స్ అధికారులు తనిఖీ చేస్తూ ఉండడం అనేది సహజం. ఆ సమయంలో ఏదైన అనుమానాస్పదమైన వస్తువులు కనిపిస్తే.. వాటిని స్వాధీనం చేసుకుని. ఆ వస్తువుని బట్టి యాక్షన్ తీసుకుంటారు. ఇది అందరికి తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే.. ఒక ప్రయాణికుడి బ్యాగ్ చెక్ చేయగా.. అందులో నూడిల్స్ ప్యాకెట్స్ కనిపించాయి. అయితే అవి సాధారణ నూడిల్స్ పాకెట్స్ తే కదా అని లైట్ తీసుకున్నారు. కానీ, వాటిని ఓపెన్ చేయగా అసలు విషయం బయట పడింది. ఆ పాకెట్స్ లో కోట్లు విలువ చేసే.. బంగారం, వజ్రాలు బయటపడ్డాయి. వాటిని చూసిన అధికారులకు నోటి మీద వేలు వేసుకోవడం ఒక్కటే తక్కువ. ఈ ఘటన ముంబై ఎయిర్పోర్ట్ లో జరిగింది. బయటపడిన బంగారం.. మొత్తం రూ.4.44 కోట్ల విలువైన 6.8 కిలోలు, ఇక వజ్రాల విలువ రూ.2.02 కోట్లు. వీటిని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.

ముంబై నుంచి బ్యాంకాక్ కు ప్రయాణిస్తున్న ఒక ఇండియన్ ప్రయాణికుడి ట్రాలీ బ్యాగ్ లో.. నూడిల్స్ పాకెట్స్ రూపంలో ఈ విలువైన నగదు బయటపడింది. దీనితో ఆ ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక శ్రీలంకలోని కొలంబో నుంచి ముంబైకి వచ్చిన మరో మహిళ బంగారాన్ని ముక్కలుగా చేసి.. తన దుస్తుల్లో దాచి అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు అధికంగా చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు అధికంగా చోటు చేసుకుంటున్నాయి. తరచూ దీనికి సంబంధించిన ఎన్నో వార్తలను చూస్తూనే ఉన్నాము. సినిమా లెవెల్ లో బంగారాన్ని , వజ్రాలను తరలిస్తూ పట్టుబడుతున్నారు.   మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి