iDreamPost

కూరగాయలు అమ్ముతున్నాడని.. వ్యక్తిని కొట్టి చంపిన పోలీస్‌ అధికారి కొడుకు!

పోలీసులు అంటే సామాన్యులకు చాలా గౌరవం. కానీ సినిమా ప్రభావం వల్ల వారిని చూస్తేనే భయపడుతుంటారు. ఇక పోలీసులదీ ఒక తీరు అయితే.. వారి పిల్లలు కొందరు కొన్ని సార్లు ఓవర్ యాక్షన్ చేస్తుంటారు.

పోలీసులు అంటే సామాన్యులకు చాలా గౌరవం. కానీ సినిమా ప్రభావం వల్ల వారిని చూస్తేనే భయపడుతుంటారు. ఇక పోలీసులదీ ఒక తీరు అయితే.. వారి పిల్లలు కొందరు కొన్ని సార్లు ఓవర్ యాక్షన్ చేస్తుంటారు.

కూరగాయలు అమ్ముతున్నాడని.. వ్యక్తిని కొట్టి చంపిన పోలీస్‌ అధికారి కొడుకు!

దేశంలో ప్రజలకు రక్షణగా నిలుస్తోంది పోలీస్ వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఖాకీ దుస్తులు ధరించిన పోలీసులు.. ప్రజలకు 24/7 సేవలు అందిస్తుంటారు. తమకు అన్యాయం జరిగితే ప్రజలు ముందుగా పరుగులు తీసేది పోలీస్ స్టేషన్లకే. ఆశ్రయించేది పోలీసులనే. కానీ సొమ్ము ఒకడిది, సోకు మరొకడిది అన్న చందంగా మారిపోతుంది పోలీసుల పిల్లల తీరు. తాము ఏ తప్పు చేసినా తమను కాపాడేందుకు పోలీసైన తమ తండ్రి ఉన్నాడన్న ధైర్యంతో భయం, బెరుకు లేకుండా తప్పడగులు వేస్తున్నారు. చట్టాలు, న్యాయాలు తమకు చుట్టాలే అని భావించి.. ఒకరిని చంపేందుకు కూడా వెనకాడం లేదు. తాజాగా ఓ పోలీసు ఉన్నతాధికారి కొడుకు ఓ అమాయకుడ్ని పొట్టనబెట్టుకున్నాడు.

ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో చోటుచేసుకుంది. తన ఇంటి ఎదురుగా కూరగాయలు అమ్ముకుని జీవనం సాగిస్తున్న ఓ యువకుడిని అత్యంత హేయంగా క్రికెట్ బ్యాటుతో కొట్టి చంపాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. మృతుడిని మోహన్ లాల్ సింధిగా గుర్తించారు. నిందితుడు క్షితిజ్ శర్మను అదుపులోకి తీసుకున్నారు పోలీసు ఉన్నతాధికారి ప్రశాంత్ వర్మ ఇంట్లో ఉండగానే ఈ దాడికి పాల్పడ్డాడు అతడి కుమారుడు . వివరాల్లోకి వెళితే.. పోలీసాఫీసర్ ప్రశాంత్ ఇంటి ముందు ఓ వ్యక్తి కూరగాయాలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. అతడికి తన ఇంటి ముందు కూరగాయలు అమ్మడం ఇష్టం లేదు. ఈవిషయంపై తరచు గొడవలు జరుగుతున్నాయి. అయితే అతడితో క్షితిజ్ వాగ్వాదానికి దిగాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య మాటల యుద్దం జరిగింది.

ఆ వాగ్వాదం పెరగడంతో కోపంతో ఊగిపోయాడు క్షితిజ్. వెంటనే ఇంట్లోకి వెళ్లి.. క్రికెట్ బ్యాట్ తీసుకుని వచ్చి మోహన్ లాల్ తలపై ఒక్కడి వేశాడు. వెంటనే మూడు సార్లు గట్టిగా కొట్టడంతో అతడు కింద పడిపోయాడు. అంతలో పెద్ద శబ్దం రావడంతో ఏం జరిగిందని బయటకు వచ్చాడు క్షితిజ్ తండ్రి, పోలీస్ ఆఫీసర్ ప్రశాంత్. వెళ్లి చూడగా బాధితుడు అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయినట్లు నిర్దారించారు వైద్యులు. పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు అందింది. సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా క్షితిజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి