iDreamPost

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. గర్భవతి అని కనికరం చూపకుండా..

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. గర్భవతి అని కనికరం చూపకుండా..

ఈ ఫోటోలో కనిపిస్తున్న భార్య భర్తల పేర్లు.. సుష్మిత, శ్రీకాంత్. వీరిది ప్రేమ వివాహం. వీరి ప్రేమను పెద్దలు కాదనడంతో.. తల్లిదండ్రులను ఎదిరించి వివాహం చేసుకున్నారు. ఖుషి సినిమాలోలా మనమేంటో ఈ ప్రపంచానికి, పేరేంట్స్‌కు నిరూపిద్దాం అని అనుకున్నారు. వీరి కాపురం ఆరు పువ్వులు, ఏడు కాయలుగా సాగిపోతుంది. వీరి ప్రేమకు గుర్తుగా మరికొన్ని రోజుల్లో వారింట్లో ఓ పసిపాప నవ్వులు విరబూయనున్నాయి. అంతలోనే సుష్మిత హఠాత్తుగా చనిపోయింది. అనారోగ్యంతో చనిపోయిందని అనుకున్నారంతా. కానీ భర్త శ్రీకాంత్ కదలికలపై సుష్మిత సోదరి అనుమానం వ్యక్తం చేసింది. సుష్మిత చావుకు ఆమె భర్తే కారణమౌ ఉంటాడని భావించిన సోదరి.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు శ్రీకాంత్‌ను ప్రశ్నించగా.. అతడి అసలు రంగు బయటపడింది. అనంతరం మీడియా ముందుకు తీసుకువచ్చారు.

క్షణికావేశంలో భార్యను చంపి, అనారోగ్యంతో చనిపోయినట్లుగా చిత్రీకరించాడు శ్రీకాంత్. రెండు ప్రాణాలను బలి తీసుకున్నాడు. ఈ ఘటన నల్లొండ జిల్లాలో చోటుచేసుకుంది. మర్రిగూడ మండలం కమ్మగూడానికి చెందిన సుష్మిత, అజ్జలాపురం గ్రామానికి చెందిన శ్రీకాంత్ ప్రేమించుకుని.. ఈ ఏడాది జనవరిలో పెళ్లి చేసుకున్నారు. కాగా, సుష్మిత ఇప్పుడు ఏడు నెలల గర్భిణీ. అయితే కొన్ని రోజుల నుండి వీరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. చిలికి చిలికి గాలి వానగా మారినట్లు.. అవి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ నెల 10వ తేదీన కూడా వీరిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆ సమయంలో కోపంతో రగిలిపోతున్న శ్రీకాంత్.. భార్య గర్భిణీ అని కూడా చూడకుండా దిండు పెట్టి ముఖంపై అదిమాడు. దీంతో ఊపిరాడక ఆమె స్పృహ కోల్పోయింది. అనంతరం ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె అనారోగ్యంతో చనిపోయినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండగా.. సుష్మిత సోదరి అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారించగా.. తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. అనంతరం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడ్ని కోర్టులో హాజరుపరిచారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి