iDreamPost

పిల్ల‌ల‌ని కంటారా? రూ.5 కోట్ల పరిహారం ఇస్తారా? కొడుకు, కోడలిపై తల్లితండ్రుల కేసు

పిల్ల‌ల‌ని కంటారా? రూ.5 కోట్ల పరిహారం ఇస్తారా? కొడుకు, కోడలిపై తల్లితండ్రుల కేసు

కొడుకుకి పెళ్లై ఆరేళ్లయింది. ఇంకా పిల్లల్ని కనలేదు. మాకు మ‌న‌మ‌డో, మ‌న‌మ‌రాలో కావాలంటూ తల్లిదండ్రులు ఉత్తరాఖండ్ లో కోర్టును ఆశ్రయించారు. ఏడాదిలోగా కనివ్వాలి. ఆ బాధ్య‌త‌ను నెర‌వేర్చ‌క‌లేక‌పోతే రూ.5 కోట్ల పరిహారం ఇవ్వాలన్న‌ది వాళ్ల‌ డిమాండ్. కొడుకుని కని, పెంచి, చదివించి, అట్టహాసంగా పెళ్లి చేసేందుకు, తమ సంపాదన మొత్తాన్ని ఖర్చు చేశామని సంజీవ్ (61), సాధనా ప్రసాద్ (57) చెప్తున్నారు.

2006లో కొడుకు శ్రేయాసాగర్ (35) కు పైలట్ శిక్షణ కోసం అమెరికా పంపించేందుకు రూ.50లక్షలు ఖ‌ర్చుచేశారు. 2007లో తమ కొడుకు ఉద్యోగం కోల్పోతే, రెండేళ్లపాటు వాళ్లే ఆర్థికంగా సాయం చేశారు. ఆ తర్వాత పైలట్ గా ఉద్యోగం రాగా, 2016లో సుభాంగి సిన్హా (31)కు ఇచ్చి పెళ్లిచేశారు. ఓ ఫైవ్ స్టార్ హోటల్లో జరిగిన ఈ పెళ్లి కోసం రూ.60 లక్షల విలువైన కారును కొనిచ్చారు. హనీమూన్ కు విదేశాలకు పంపారు. పెళ్లై ఆరేళ్లయినా.. ఇంతవరకూ పిల్లల్ని కనకపోవడంపై ఆ తల్లిదండ్రుల్లో అసహనం. ఏడాదిలోగా పిల్లల్ని కనివ్వాలని, లేనిపక్షంలో రూ.5 కోట్లైనా తమకు ఇవ్వాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ.. కోర్టు మెట్లెక్కారు.

హరిద్వార్ లో దాఖలైన ఈ పిటిషన్ పై మే 17వ తేదీన విచారణ జరగనుంది. కానీ, ఈ కేసుపై కొడుకు, కోడలు స్పందించలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి