iDreamPost

విద్యుత్ కోతలు.. జార్ఖండ్ సర్కారుపై ధోని భార్య ఫైర్

విద్యుత్ కోతలు.. జార్ఖండ్ సర్కారుపై ధోని భార్య ఫైర్

విద్యుత్ కోతలపై సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా బాధ పడుతున్నారు. కరెంటు కోత.. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భారత క్రికెట్ టీం మాజీ సారథి మహేంద్రసింగ్ ధోని భార్య సాక్షిసింగ్ విద్యుత్ కోతలపై జార్ఖండ్ ప్రభుత్వ వైఖరిని నిలదీస్తోంది. ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తోంది. కరెంటు కోతలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వాలు గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు.

అప్రకటిత కోతలతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. అందరుకూడా విధిగా పన్నులు చెల్లిస్తున్నారు. సమయానికి విద్యుత్ బిల్లులు తీసుకుంటున్న అధికారులకు కోతలు కనిపించడం లేదా? అని సాక్షి ప్రశ్నిస్తున్నారు. సామాన్యులు పడే బాధలను గుర్తించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ఫలితంగా ఎడాపెడా కోతలు అమలుచేస్తున్నారు. దీనిపై ప్రతిపక్షాలు సైతం మిన్నకుండిపోతున్నాయి.జార్ఖండ్ ప్రభుత్వం ఎందుకు కోతలు విధిస్తోందని అడుగుతున్నారు. బొగ్గు నిల్వలు ఉన్నా ఉత్పత్తిలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతోనే కరెంటు కోతలు పెరిగిపోతున్నాయా? అని నిలదీస్తున్నారు.

ఈ నేపథ్యంలో ధోని భార్య ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో పాలన సరిగా ఉండటం లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం సరైన విధంగా పాలన చేస్తే సమస్యలు ఉండవని కుండబద్ధలు కొట్టారు. ప్రభుత్వం కూడా నైరాశ్యంలో పడుతోంది. ప్రజలబాధలు తీర్చడంలో మీనమేషాలు లెక్కిస్తోందని అపవాదు మూటగట్టుకుంటోంది. ఎండలు ఒకవైపు మండిపోతున్నాయి. జనం ఎండకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు .మిట్ట మధ్యాహ్నం నడిరోడ్లు నిర్మాణుష్యంగా మారుతున్నాయి. ప్రజలు ఇళ్లకు పరిమితమవుతున్నారు. దీనివల్ల విద్యుత్ వినియోగం పెరుగుతోంది.

అందుకే రాష్ట్రంలో ఎడాపెడా విద్యుత్ కోతలు ప్రకటిస్తున్నాయి. రోజువారి ఉష్ణోగ్రతలు నలబై డిగ్రీలు దాటుతోంది. అందుకే కరెంటు వినియోగం పెరుగుతోంది. కోతలు తప్పడం లేదు. కొంత కాలంగా ఈ కోతలు అమలు జరుగుతుండడంతో సాక్షి గళం విప్పారు. ఆమె తన ట్విట్టర్ వేదికగా జార్ఖండ్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అదే సమయంలో భవిష్యత్ లో విద్యుత్ కోతలు రాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి