iDreamPost

దేశంలో పది కరోనా హాట్ స్పాట్లు … జనాల్లో టెన్షన్

దేశంలో  పది కరోనా హాట్ స్పాట్లు … జనాల్లో టెన్షన్

కరోనా వైరస్ ను వేగంగా వ్యాపింప చేసే అవకాశాలున్న రాష్ట్రాలను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. 6 రాష్ట్రాల్లోని ఎనిమిది ప్రాంతాల నుండి వైరస్ చాలా స్పీడుగా వ్యాపిస్తోందని కేంద్రం గుర్తించింది. అందుకే వీటిని కరోనా వైరస్ హాట్ స్పాట్లుగా ప్రకటించింది. ఆరు రాష్ట్రాలు ఏమిటంటే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్ధాన్, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోని పది ప్రాంతాల నుండి వైరస్ చాలా వేగంగా వ్యాపించింది. ఆరు రాష్ట్రాల్లోని పది ప్రదేశాల్లో జనాలు విపరీతంగా గుమిగూడటం వల్లే వైరస్ సమస్య దేశంలో ఒక్కసారిగా పెరిగిపోయిందని కేంద్రం నిర్ధారించింది.

ఢిల్లీలోని మతగురువు ఖ్వాజా నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ మసీదులో జరిగిన మత ప్రార్ధనలు నెంబర్ 1 హాట్ స్పాట్ గా కేంద్రం గుర్తించింది. ఈ మత ప్రార్ధనల్లో పాల్గొని వివిధ రాష్ట్రాలకు తిరిగి వెళ్ళిన వాళ్ళవల్లే వైరస్ వ్యాప్తి పెరిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. మసీదు ప్రాంతంతో పాటు ఈశాన్య ఢిల్లీలోని దిల్షాన్ గార్డెన్ కూడా కీలకమైనదే. సౌదీ వెళ్ళొచ్చిన మహిళ ద్వారా చాలామందికి వైరస్ సోకినట్లు ప్రభుత్వం గుర్తించింది.

ఉత్తర్ ప్రదేశ్ : ఢిల్లీకి ఆనుకునే ఉన్న నోయిడాలోని ఓ ప్రైవేటు కంపెనీ ద్వారానే వైరస్ విపరీతంగా వ్యాపించిందట. రాష్ట్రంలోని మీరట్ లో 100 మంది బాధితులున్నారు. నోయిడాలో 38 పాజిటివ్ కేసులతో పాటు మరో 32 కేసులున్న వాళ్ళ పరిస్ధితి క్లిష్టంగా మారింది. 300 మంది స్వీయ నిర్బంధంలో ఉన్నారు. 1852 మంది అబ్వర్జేషన్లో ఉన్నారంటేనే పరిస్ధితి ఎంత క్రిటికల్ గా ఉందో అర్ధమవుతోంది.

మహారాష్ట్ర : రాష్ట్రంలోని వర్లి, గొరేగాం, కొలివాడ ప్రాంతాలు వైరస్ వ్యాప్తికి కేంద్రాలుగా మారాయి. వైరస్ దెబ్బకు ముంబాయ్ లో 8 మంది చనిపోతే మరో 167 మంది చికిత్స చేయించుకుంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటికి 235 మందికి వైరస్ సోకింది.

కేరళ : రాష్ట్రంలో 220 మందికి వైరస్ ఉంది. దేశంలో బయటపడిన మొదటి కేసు కేరళలోనే. 7725 మంది అబ్జర్వేషన్లో ఉన్నారంటేనే పరిస్ధితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధమవుతోంది.

గుజరాత్: రాష్ట్రంలో నమోదైన 73 కేసుల్లో 28 అహ్మదాబాద్ లోనే రికార్డయ్యాయి. అలాగే చనిపోయిన ఆరుగురిలో ముగ్గురు ఇక్కడే వాలో నమోదైన 106 పాజిటివ్ కేసుల్లో 26 జౌళి నగరమైన భిల్వారాలోనే ఉన్నాయి. వీరిలో ఇద్దరు ళ్ళే కావటం గమనార్హం.

రాజస్ధాన్ : రాష్ట్రంలో నమోదైన 106 పాజిటివ్ కేసుల్లో 26 జౌళి నగరమైన భిల్వారాలోనే ఉన్నాయి. వీరిలో ఇద్దరు చనిపోయారు. మొత్తం మీద 1200 మంది పరిశీలనలో ఉన్నారు. ఈ మొత్తం మీద మనం సంతోషించాల్సిన విషయం ఏమిటంటే హాట్ స్పాట్లలో తెలుగు రాష్ట్రాలు లేనందుకు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి