iDreamPost

లక్ష్యమంటే ఇది.. కూతురి కోసం IASగా మారిన కూలి కథ

లక్ష్యమంటే ఇది.. కూతురి కోసం IASగా మారిన కూలి కథ

దేశంలో అత్యత్తమ సర్వీసుల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ముందు వరుసలో ఉంటాయి. సివిల్స్ సర్వీసు చేపట్టి.. దేశానికి సేవ చేయాలని భావిస్తుంటారు యువత. సివిల్స్ సాధించాలంటే యుపీఎస్సీ నిర్వహించే కఠిన పరీక్షల్లో పాస్ కావాల్సి ఉంటుంది. తొలి సారి ప్రయత్నంలో సివిల్ సర్వీస్ కొల్లగొట్టిన వారు చాలా అరుదుగా ఉంటారు. కొంత మంది దండయాత్ర చేసినా సాధ్య పడదు. ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా.. స్వయం కృషితో సివిల్ సర్వీస్ కొల్లగొట్టి ఆదర్శంగా నిలిచిన వ్యక్తులు ఉన్నారు. అటువంటి వారి జాబితాలోకి వస్తారు రైల్వే స్టేషన్ కూలీ శ్రీనాథ్. కేవలం సాధించాలన్న తపనతోనే.. సివిల్స్ పరీక్షలో పాసై..విజయ దుందుభి మోగించారు.

శ్రీనాథ్ కేరళలోని మున్నార్ నివాసి. పెళ్లై, పిల్లలున్నా.. వారికి ఏమీ ఆస్తులివ్వలేనని భావించిన అతడు.. మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం సివిల్స్ సాధించాడు. శ్రీనాథ్ ఎర్నాకులంలో రైల్వే స్టేషన్‪లో కూలి పనులు చేస్తుంటారు. ఆయనకు ఓ కూతురు ఉంది. ఈ కూలీ చేసే కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి. రోజుకూ 400-500 మాత్రమే సంపాదించేవాడు. అవి ఇంటి ఖర్చులకు మాత్రమే వచ్చేవి. శ్రీనాధ్‌కు తన కుమార్తె అంటే ఎంతో ఇష్టం. అయితే ఆమెకు ఆస్థి పరంగా ఏమీ ఇవ్వలేనని భావించిన ఆయన.. ఆమెకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని అనుకున్నాడు. తన కూతురు కోసం కష్టపడి చదివి, ఉన్నత ఉద్యోగం సాధించాలనుకున్నాడు. కష్టాలు ఎదురైన.. ఎక్కడా తొణకకుండా.. సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నాడు.

అయితే కోచింగ్ తీసుకునేందుకు తన వద్ద ఆదాయం లేకపోవడంతో, స్వీయ అధ్యయనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. స్టడీ మెటీరియల్ కొనుక్కోవడానికి డబ్బులు లేకపోవడంతో.. రైల్వే స్టేషన్ లో ఉన్న ఉచిత వైఫైను వరంలా మార్చుకున్నాడు అతను. ఫ్రీ వైఫైతో చదువు ప్రారంభించారు. కూలీ ఉన్నప్పుడు పని చేసి..లేని సమయంలో సివిల్స్ సర్వీసుకు సంబంధించిన ఆన్ లైన్ తరగతులను వినేవాడు. వాటిని విని నోట్స్ ప్రిపేర్ చేసుకునే వాడు. కేరళ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాక అతనిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ తర్వాత యూపీఎస్సీ పరీక్షపై దృష్టి పెట్టాడు. ఇది మూడు సార్లు విఫలమైనప్పటికీ.. ఎక్కడా కాస్తంత కూడా నిరుత్సాహ పడలేదు. నాలుగో ప్రయత్నంలో యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణుడు అయ్యాడు. కూలి పనులు చేసే నాటి నుండి ఐఏఎస్ గా ఆయన ఎదిగిన తీరు ఎంతమందికో ఆదర్శం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి