iDreamPost

న్యూ ఇయర్ కానుక.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు..ఎంతంటే!

Gas Cylinder Price: వస్తువుల ధరలు మండిపోతున్నాయి. ఇంట్లో వస్తువుల నుంచి ఇంధనం వరకు అన్ని ఆకాశం వైపే చూస్తున్నాయి. ఇలాంటి సమయంలో గ్యాస్ సిలిండర్ విషయంలో ఓ శుభవార్త తెలిసింది. మరి.. ఆ వివరాలు..

Gas Cylinder Price: వస్తువుల ధరలు మండిపోతున్నాయి. ఇంట్లో వస్తువుల నుంచి ఇంధనం వరకు అన్ని ఆకాశం వైపే చూస్తున్నాయి. ఇలాంటి సమయంలో గ్యాస్ సిలిండర్ విషయంలో ఓ శుభవార్త తెలిసింది. మరి.. ఆ వివరాలు..

న్యూ ఇయర్ కానుక.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు..ఎంతంటే!

అందరు కొత్త ఏడాదిని ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్టి చేసుకుని, సందడి చేస్తూ.. నూతన సంవత్సరానికి గ్రాండ్ వెలకమ్ చెప్పారు. నగరంలోని రిస్టార్ట్ లు, పబ్ లు, హోటళ్లు సందడిగా మారాయి. నగర ప్రజలు ఒకరికొక్కరు హ్యాపీ న్యూ ఇయర్ అంటూ విషెష్ చెప్పుకున్నారు.  ఇలా కొత్త ఏడాది సందడిలో ఉన్న ప్రజలకు ఒక శుభవార్త వచ్చింది. ఎల్బీజీ గ్యాస్ సిలిండర్ ధర విషయంలో ఓ ఆసక్తికరమైన వార్త వచ్చింది. ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గింపుతో కొత్త సంవత్సరం 2024 ప్రారంభమైంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఈరోజు కొత్త ఎల్పీజీ సిలిండర్ల ధరలను విడుదల చేశాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

నేటికాలంలో ప్రతి వస్తువు ఆకాశం వైపు మాత్రమే చూస్తున్నాయి. తప్ప నేలకు దిగిరావడం లేదు. ఇంట్లో వస్తువుల నుంచి  ఇంధనం వరకు అన్ని ధరలు మండిపోతున్నాయి. ముఖ్యంగా గ్యాస్ ధర అయితే సామాన్యుడికి గుది బండలాగా మారింది. ఇక కమర్షియల్ సిలిండర్ ధరల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలా గ్యాస్ ధరలతో అందరూ అల్లాడుతున్న వేళ కొత్త ఏడాదికి కానుక ఓ శుభవార్త వచ్చింది. నేడు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకొన్నాయి. అయితే ఇదే సమయంలో దేశీయ ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

gas rates reduced

చమురు మార్కెటింగ్ కంపెనీలు ఈరోజు కొత్త ఎల్పీజీ సిలిండర్ల ధరలను విడుదల చేశాయి. ఆ వివరాల ప్రకారం.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల సంవత్సరం కావడంతో భారీ కోత తప్పదని అందరూ భావించారు. కారణం.. 2019లో కూడా ఎన్నికల సమయంలో కూడా ఇలానే చమురు కంపెనీలు దేశీయ ఎల్పీజీ వినియోగదారులకు న్యూ ఇయర్ కానుకను అందించాయి. 14 కేజీల దేశీయ ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.120.50 తగ్గింది. అలానే దేశ రాజధాని ఢిల్లీ నగరంలో సిలిండర్ ధర రూ.809.50 నుంచి రూ.689కి తగ్గింది.

కానీ.. ఈ ఏడాది మాత్రం కేవలం కమర్షియల్  సిలిండర్ రేట్లు మాత్రమే తగ్గాయి. అంటే కేవలం వాణిజ్యదారులకు మాత్రమే ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. అలానే తాజాగా ధరల ప్రకారం.. ఈరోజు ఢిల్లీ నగరంలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ రూ.1757 నుంచి రూ.1755.50కి తగ్గింది. అంటే ఈ రోజు రూ.1.50 మాత్రమే చవకగా మారింది. అదేవిధంగా కలకత్తాలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ విలువ రూ.1869.00గా మారింది. గతేడాది డిసెంబర్‌లో దీని ధర రూ.1868.50గా ఉంది. ఈరోజు 50 పైసలు తగ్గింది. వాణిజ్య నగరమైన బాంబేలో రూ.1710కి లభించే వాణిజ్య సిలిండర్  ఈరోజు నుంచి రూ.1708.50కి అందుబాటులోకి రానుంది. చెన్నైలో ఇప్పుడు రూ.1929కి బదులుగా రూ.1924.50కి  అమ్మబడుతుంది. అంటే.. 5.50 పైసలు గ్యాస్ ధర తగ్గింది. మరి.. ఈ గ్యాస్ సిలిండర్ సమాచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి