iDreamPost

YSR కొడుకుగా వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం గర్వంగా ఉంది: వైఎస్‌ జగన్‌

  • Published Mar 06, 2024 | 1:43 PMUpdated Mar 06, 2024 | 1:43 PM

ఏళ్లుగా ప్రకాశం జిల్లా వాసులు ఎదురు చూస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

ఏళ్లుగా ప్రకాశం జిల్లా వాసులు ఎదురు చూస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

  • Published Mar 06, 2024 | 1:43 PMUpdated Mar 06, 2024 | 1:43 PM
YSR కొడుకుగా వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం గర్వంగా ఉంది: వైఎస్‌ జగన్‌

సుమారు 20 ఏళ్లుగా ఎదురు చూస్తోన్న ప్రకాశం జిల్లా వాసుల కల ఇప్పుడు నెరవేరింది. నాడు మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన వెలిగొండ ప్రాజెక్ట్‌ను.. నేడు ఆయన కుమారుడు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాజెక్ట్‌ను ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్‌ కొడుకుగా వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం గర్వంగా ఉందన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్‌తో దశాబ్ధాల కల నెరవేరింది. టన్నెల్‌లో ప్రయాణించినప్పుడు సంతోషంగా అనిపించింది. అద్భుతమైన ప్రాజెక్ట్‌ను పూర్తి చేసినందుకు సంతోషంగా ఉంది.

మహానేత వైఎస్సార్‌ వెలిగొండ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. ఆయన కుమారుడిగా ఈ ప్రాజెక్ట్‌ను నేనే పూర్తి చేయడం గర్వంగా ఉంది. ఇది దేవుడి రాసిన స్క్రిప్ట్‌. ఈ ప్రాజెక్ట్‌తో 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించాం. ఈ టెన్నల్‌ వల్ల ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలకు ప్రయోజనం కలుగుతుంది. వెలిగొండ ప్రాజెక్ట్‌తో నాలుగు లక్షల 47వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. యుద్ధ ప్రాతిపదికన వెలిగొండ ప్రాజెక్ట్‌ జంట సొరంగాలు పూర్తి చేశామని.. ఇది ఆసియాలోనే అత్యంత పొడవైన సొరంగాలు అన్నారు. ఎన్నికల వేళ చెప్పినట్లుగానే.. ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి.. మాట నిలబెట్టుకున్నాం అని తెలిపారు.

కరువు ప్రాంతంగా పేరు తెచ్చుకున్న రాయలసీమతో పాటు పశ్చిమ ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజల నీటి సమస్యను తీర్చేందుకు చేపట్టినదే వెలిగొండ ప్రాజెక్ట్‌. మార్కాపురం డివిజన్ పెద్ద దోర్నాల సమీపంలో నల్లమల అటవీ ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేశారు ఈ ప్రాజెక్ట్‌ పూర్తి పేరు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు. శ్రీశైలం ప్రాజెక్ట్‌లోని అదనపు నీటిని రెండు సొరంగ మార్గాల ద్వారా ఈ ప్రాజెక్టుకి తరలిస్తారు. ఈ క్రమంలోనే నాడు వైఎస్సార్.. జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ పై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ దీన్ని పూర్తి చేశౠరు.

2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామంటూ ఈ ప్రాంత వాసులకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును పూర్తి చేశాకే మళ్లీ మీ ముందుకు వస్తానని నాడు ఇచ్చిన మాటను నేడు జగన్‌ నిలబెట్టుకున్నారు. అన్నట్లుగానే ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేసి. మాట నిలబెట్టుకున్నారు. అతి తక్కువ సమయంలోనే రెండు సొరంగ పనులను పూర్తి చేసి ప్రకాశం పశ్చిమ ప్రాంతంతో పాటు కడప, నెల్లూరు జిల్లాల ప్రజల్లో ఆనందం నింపారు జగన్‌.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి