iDreamPost

ప్రజలకు మరింతగా దగ్గరగా.. వాట్సాప్ చానల్లో CM జగన్!

ప్రజలకు మరింతగా దగ్గరగా.. వాట్సాప్ చానల్లో CM జగన్!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచి నేటి వరకు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలతో మమేకమవుతూ వస్తున్నారు. అలానే తరచూ సాయం కోసం వచ్చిన వారిని మంచి మనసుతో ఆదుకుంటూ నేనున్నా అంటూ సీఎం జగన్ భరోసా కల్పిస్తున్నారు. సీఎంగా జగన్ మోహన్ రెడ్డి బిజీ బిజీగా ఉన్నప్పటికి ప్రజలతో కలవడం, వారి సమస్యలు తెలుసుకోవడంలో మాత్రం ఎక్కడ తగ్గదలేదు. అయినప్పటికీ ఇంకా చాలా మంది ప్రజలతో సీఎం జగన్ కలవడం సాధ్యం కావడం లేదు. ఈ క్రమంలోనే ప్రజలకు మరింత  దగ్గర కావడం కోసం కొత్త మార్గాని ఎంచుకున్నారు.  ప్రజలతో నేరుగా  సోషల్ మీడియా ద్వారా మమేకం అయ్యే విధంగా సీఎం జగన్ వాట్సాప్ చానల్ లో చేరారు. ఇక నుంచి వైఎస్ జగన్ పేరు మీద ఉన్న వాట్సాప్ చానల్ ద్వారా ప్రజలకు మరింత దగ్గర కానున్నారు.

ప్రజల సమస్యలు తెలుసుకోవడం, వాటిని పరిష్కరించడంలో సీఎం జగన్ ..తండ్రికి తగ్గ తనయుడైన నిరూపించుకున్నారు. ఇక సుపరిపాలన అందించడంలో అయితే తండ్రిని మించిన తనయుడని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా ప్రజల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సీఎం జగన్.. వారికి మరింత చేరువు అయ్యేందుకు వాట్సాప్ చానల్ లో చేరారు.  డిజిటల్ మీడియా వాట్సాప్ కమ్యూనిటీ ద్వారా  ఈ విధంగా  కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఇక నుంచి మీకు మరింత దగ్గరగా ఉంటానంటూ సీఎం జగన్ తన తొలి సందేశంలో పేర్కొన్నారు. ఈ డైరెక్ట్ చానల్ ద్వారా  ప్రభుత్వం, ప్రజల మధ్య అవినాభావం సంబంధం పెంచుకునేందుకు తోడ్పడుతుంది.

అలానే వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, విధాన ప్రకటనలు ఇతర సంబంధిత సమాచారాలను ప్రజలు సులువుగా తెసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని సీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. కొత్తగా వస్తున్న సమాచార సాంకేతిక మాధ్యమాలను వినియోగించుకోవడం ద్వారా మరింత పారదర్శకమైన పాలన అందించాలనే సీఎం నిబద్ధతను ఇది తెలియజేస్తోంది.  సోషల్ మీడియాల్లో ఒకటైన వాట్సాప్ ఇటీవల చానల్ ను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.  ఇందులో భాగంగానే సీఎం జగన్ వాట్సాప్ చానల్ ను ప్రారంభించారు.  ఒక్కసారి లింక్ ఓపెన్ చేసి ఫాలో అయితే చాలు.. వాట్సాప్ స్టేటస్ లోకి వెళ్లి చూస్తే.. సీఎం చేసిన ప్రతి పోస్టు మనకు కనిపిస్తోంది.  సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాట్సాప్ ఛానల్ ను ఫాలో కావాలంటే ఈ  https://whatsapp.com/channel/0029Va4JGNi42DccmaxNjf0q లింక్ ను క్లిక్ చేయాలని  సీఎంవో తెలిపింది. మరి.. ఇలా సీఎం జగన్ వాట్సాప్ చానల్ ప్రారంభించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి