iDreamPost

యాత్ర సినిమా చూసిన తర్వాత జగన్ ఒక్కటే చెప్పారు: డైరెక్టర్ మహి

Jagan Reaction On Yatra Movie: యాత్ర సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సెన్సెషన్ అయ్యిందో అందరికీ తెలుసు. ఇప్పుడు అదే రూట్ లో యాత్ర 2 సినిమా కూడా సాగుతోంది.

Jagan Reaction On Yatra Movie: యాత్ర సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సెన్సెషన్ అయ్యిందో అందరికీ తెలుసు. ఇప్పుడు అదే రూట్ లో యాత్ర 2 సినిమా కూడా సాగుతోంది.

యాత్ర సినిమా చూసిన తర్వాత జగన్ ఒక్కటే చెప్పారు: డైరెక్టర్ మహి

యాత్ర 2 సినిమా.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. సరిగ్గా ఐదేళ్ల క్రితం యాత్ర సినిమా రిలీజ్ అయ్యింది. ఆ మూవీకి ఏ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందో.. ఇప్పుడు యాత్ర 2 సినిమాకి కూడా ప్రేక్షకుల నుంచి అదే స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఒక స్టార్ హీరో సినిమాకి వచ్చినట్లు థియేటర్లలో సందడి నెలకొంది. ముఖ్యంగా మహి వీ రాఘవ్ డైరెక్షన్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఒక పొలిటికల్ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నాం అంటూ ఆడియన్స్ చెప్తున్నారు. చూసిన ప్రతి ఒక్కరు చాలా మంచి మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ ఈ మూవీ చూసి ఏం చెప్పారు? అనే ప్రశ్న అందరికీ ఉంటుంది. ఆ ప్రశ్నకు డైరెక్టర్ సమాధానం చెప్పాడు.

యాత్ర సినిమాకి సంబంధించి డైరెక్టర్ మహి వీ రాఘవ్, హీరో జీవా పెద్దఎత్తున ప్రమోషన్స్ చేశారు. సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేలా.. థియేటర్లకు పరుగులు పెట్టేలా డైరెక్టర్ ప్రమోషన్స్ చేశాడు. దానికి తగినట్లుగానే యాత్ర 2 సినిమాకి కూడా స్పందన వస్తోంది. అయితే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ మహి వీ రాఘవ్ కు ఒక ప్రశ్న ఎదురైంది. అదేంటంటే.. యాత్ర సినిమా చూసి జగన్ ఏమన్నారు అంటూ యాంకర్ ప్రశ్నించారు.

యాంకర్ ప్రశ్నకు డైరెక్టర్ సమాధానం చెబుతూ.. “యాత్ర సినిమా చూసిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి ఒక్కటే అన్నారు. అందరూ చెప్పిన కామెంట్ అయితే ఆయన చెప్పలేదు. ఇది మహీస్ వర్షన్ ఆఫ్ వైఎస్సార్ అయ్యా అన్నారు. నేనేం చెప్పాలి అన్నారు. వాళ్లు దగ్గరగా చూశారు కాబట్టి.. వారికి తెలుసు ఆయన ఎలా ఉంటారు అని. మనం బయటి నుంచి చూసింది.. వాళ్లు రోజూ దగ్గరుండి చూసే దానికి వారికే ఎక్కువ తెలుస్తుంది. అందుకే ఏం కామెంట్ చేయలేదు. అది నీ ఇంటర్ ప్రిటేషన్, నీ ఇమాజినేషన్ అని చెప్పారు. యాత్ర 2 సినిమా స్టార్ట్ చేసిన తర్వాత కూడా చాలాసార్లు కలిశాను. అయితే వర్క్ పరంగా కలిశాను. కానీ, సినిమా విషయంలో మాత్రం కాదు.

మూవీ విషయంలో పెద్దగా ఇన్ పుట్స్ తీసుకునేది ఏం లేదు. మీ గురించి చెప్తున్నప్పుడు మీ దగ్గరి నుంచి స్టోరీ తీసుకోవడం కరెక్ట్ కాదు. మీరు అన్నీ మీ పాజిటివ్ వే.. మిమ్మల్ని గ్లోరిఫై చేస్తూ చెప్తాం. నాకు ఫాక్ట్స్ తెలుసు, ఏం జరిగిందో తెలుసు. యాత్ర ఎలాగైతే చేశానో.. యాత్ర 2 కూడా చేశాను. నాకు తెలిసిన విషయాన్ని, నాకు తెలిసిన ఫాక్ట్స్ ని నా వేలో నేను ప్రెజెంట్ చేశాను. బయట ఉన్న ఇష్టాలను కథలోకి తీసుకురాలేము. సినిమా అనేది ఒక ఫ్రెష్ మీడియం. బయట మీ గ్రాఫ్ ఎక్కువ ఉండచ్చు. కానీ, సినిమాలో స్టార్ట్ చేసినప్పుడు అగైన్ స్టార్ట్ నుంచే తీసుకురావాలి” అంటూ డైరెక్టర్ మహి వీ రాఘవ్ చెప్పుకొచ్చాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి