iDreamPost

AP విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీ పడేలా.. మరో కీలక అడుగు..

IB Syllabus In AP SCERT: ఏపీ విద్యార్థుల భవితవ్యం కోసం ఇప్పటికే సీఎం జగన్ పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా మరో అడుగు ముందుకేశారు.

IB Syllabus In AP SCERT: ఏపీ విద్యార్థుల భవితవ్యం కోసం ఇప్పటికే సీఎం జగన్ పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా మరో అడుగు ముందుకేశారు.

AP విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీ పడేలా.. మరో కీలక అడుగు..

విద్యారంగం విషయంలో సీఎం జగన్ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక మార్పుల గురించి అందరికీ తెలిసిందే. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ ఇంగ్లీష్ విద్యా అందాలనే సదుద్దేశంతో ఆంగ్ల మాధ్యమాన్ని సర్కారు బడులకు తీసుకొచ్చారు. అక్కడితో ఆగకుండా ప్రీ లోడెడ్ బైజూస్ కంటెంట్ తో కూడిన ట్యాబులు, ఐఎఫ్ పీలతో కూడిన డిజిటల్ క్లాస్ రూములు, ఇంగ్లీష్ ల్యాబులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రైవేటు స్కూళ్లను తలదన్నేలా ఆత్యాధునిక సౌకర్యాలు, విద్యార్థుల ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ పెంచేలా.. టోఫెల్ వంటి పరీక్షలను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ధనిక, పేద విద్యార్థుల మధ్య ఉన్న విద్యాంతరాలను తొలగించేలా.. అంతర్జాతీయ విద్యాబోధన IBని సైతం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చేరువ చేయబోతున్నారు.

రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీ పడేలా, అక్కడ నెగ్గేలా తీర్చిదిద్దడంలో జగన్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్(SCERT)లో అంతర్జాతీయ విద్యాబోర్డు ఇంటర్నేషనల్ బాకాలారియేట్(IB) భాగస్వామ్యం కాబోతోంది. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో IB, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర SCERT బృందాల మధ్య నేడు ఒప్పందం జరిగింది. దేశంలో ఎక్కడాలేని విధంగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాష్ట్ర బోధనను రూపొందించబోతున్నారు. IBని మన పాఠశాల విద్యాశాఖ SCERTలో భాగంగా చేయబోతున్నారు.

2024-25 విద్యాసంవత్సరంలో టీచర్ల సామర్థ్యం, నైపుణ్యం పెంచేలా శిక్షణ ఇవ్వనున్నారు. జూన్ 2025 నుండి ఒకటో తరగతికి IBలో విద్యాబోధన ప్రారంభించబోతున్నారు. జూన్ 2026 నుండి రెండో తరగతికి IBలో విద్యాబోధన ఉంటుంది. ఇలా క్రమంగా ఒక్కో ఏడాది ఒక్కో తరగతికి పెంచుకుంటూ పోతూ 2035 నాటికి 10వ తరగతికి, 2037 నాటికి 12వ తరగతికి IB విధానాన్ని పరిచయం చేయబోతున్నారు. మన విద్యార్థులను IB విధానానికి సన్నద్ధులను చేస్తూ.. గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దే ప్రక్రియకు 2019 నుండే జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఇప్పటికే ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన- సీబీఎస్ఈ మొదలు IBదాకా ఇప్పుడు విద్యార్థుల ప్రతిభను పెంచబోతున్నారు.

IB విద్యాబోధన ప్రత్యేకతలు:

దీనిని ప్రపంచంలోనే అత్యుత్తమ బోధనా పద్ధతిగా చెబుతారు. దీనివల్ల బట్టీ చదువులకు విద్యార్థులు స్వస్తి చెప్పేయచ్చు. థియరీతో పాటు ప్రాక్టికల్ అప్లికేషన్ పద్ధతిలో విద్యా బోధన అనేది సాగుతుంది. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలకు ప్రోత్సాహించేందుకు ఈ IB విద్యాబోధన విధానం దోహదపడుతుంది. ఈ ఐబీ బోధనా విధానంలో ప్రస్తుత, భావి తరాల అవసరాలకు అనుగుణంగా సిలబస్ రూపకల్పన ఉంటుంది. అలాగే బోధనా విధానం, మూల్యాంకనం కూడా ఉంటాయి. క్లాస్ రూమ్ బోధన మాత్రమే కాకుండా.. నైపుణ్యాలు, ఎక్స్ ట్రా కరికులర్ యాక్టివిటీస్, ప్రాక్టికల్స్ కు ఈ విధానంలో సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. ఇంటర్ డిసిప్లేనరీ కాన్సెప్ట్ ఉంటుంది. అంటే.. నిజ జీవిత అంశాలు వివిధ సబ్జెక్టుల దృష్టి కోణంలో అధ్యయనం చేయడం. ఇతర విద్యార్థులతో పోలిసత్.. ఈ IB విధానంలో విద్యని అభ్యసించిన విద్యార్థులకు ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో ప్రవేశం దొరికే అవకాశాలు 3 రెట్లు అధికంగా ఉంటుంది. IB విధానంలో విద్యని అభ్యసించిన వారికి ప్రపంచస్థాయి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి