iDreamPost

నన్ను వేధిస్తున్నారు.. రక్షించండని వేడుకుంటోన్న CID నటి

సినీ రంగంలో తమ అందచందాలతో, నటనతో ఆకట్టుకుంటారు నటీమణులు. హీరోయిన్ లేని సినిమాను కానీ, సీరియల్ కానీ ఊహించడం కష్టం. అయితే తెరపై అందంగా కనిపిస్తున్న తారామణుల జీవితంలో కష్టాలు, సమస్యలు లేవని చాలా మంది ఊహిస్తుంటారు.. కానీ..

సినీ రంగంలో తమ అందచందాలతో, నటనతో ఆకట్టుకుంటారు నటీమణులు. హీరోయిన్ లేని సినిమాను కానీ, సీరియల్ కానీ ఊహించడం కష్టం. అయితే తెరపై అందంగా కనిపిస్తున్న తారామణుల జీవితంలో కష్టాలు, సమస్యలు లేవని చాలా మంది ఊహిస్తుంటారు.. కానీ..

నన్ను వేధిస్తున్నారు.. రక్షించండని వేడుకుంటోన్న CID నటి

తెర మీద రంగులు పూసుకుని ఎంటర్ టైన్ చేస్తోన్న నటీమణులకు వ్యక్తిగత జీవితం ఉంటుంది. సినిమాల్లో, సీరియల్లో నటించగా వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేస్తుంటారని.. వాళ్లకు కష్టాలు ఉండవని ఓ అంచనాకు వస్తుంటారు చాలా మంది. కానీ వారి పర్సనల్ లైఫ్ చాలా భిన్నంగా ఉంటుంది. మేకప్ తీసేస్తే వాళ్లు కూడా సామాన్యులే. మనలాంటి ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, కష్ట నష్టాలు వాళ్లకు ఉంటాయి. ఆ సమస్యలను తట్టుకోలేక కొంత మంది సెలబ్రిటీలు ఆత్మహత్యలకు ఒడిగట్టిన సందర్భాలున్నాయి. అయితే కుటుంబ సభ్యులే ఇబ్బందులకు గురి చేస్తుంటే.. ఈ నటి విషయంలో అదే జరిగింది. సొంత కుటుంబ సభ్యులే కక్ష కట్టడంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది.

బుల్లి తెరపైన ఎంతో కాలంగా అలరించిన క్రైమ్ అండ్ థ్రిల్లర్ హిందీ సీరియల్ ఏందంటే సీఐడీ. ఈ సీరియల్ పలు భాషాల్లోకి డబ్బింగై మంచి ఆదరణ చూరగొంది. ఈ సీరియల్లో సబ్ ఇన్ స్పెక్టర్ తాషా కుమార్ క్యారెక్టర్ లో అలరించిన నటి వైష్ణవి ధన్ రాజ్.. తనను కాపాడండి అంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనపై కుటుంబ సభ్యులు దాడి చేశారంటూ ఆరోపించింది. అలాగే సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో కూడా రిలీజ్ చేసింది. తనకు ప్రాణ హాని ఉందని, కాపాడండి అంటూ పేర్కొంది. ఆ వీడియోలో ఏముందంటే..‘నేను ప్రస్తుతం ముంబయి కాశీమీరా పోలీస్ స్టేషన్‌లో ఉన్నాను. నా కుటుంబ సభ్యులు నాపై దాడి చేసి గాయపరిచారు. ప్రతి ఒక్కరి నుండి నాకు హెల్ప్ కావాలి. మీడియా, న్యూస్ ఛానల్స్,మీడియా, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ సాయం చేయండి’అని వేడుకున్నారు.

attack on cid actress

వైష్ణవి 2008లో టీవీలో తన కెరీర్ స్టార్ చేసింది. ఏక్తా కపూర్ నిర్మించిన పలు సీరియల్స్‌లో నటించింది. అడపా దడపా సినిమాలు చేసింది. 2009లో సీఐడీ సీరియల్లో సబ్ ఇన్ స్పెక్టర్ తాషా క్యారెక్టర్ లో కనిపించింది. ఆ తర్వాత క్విట్ అయ్యి.. 2012లో రీజాయిన్ అయ్యింది. వైష్ణవి 2012లో నటుడు నితిన్ షెరావత్‌ను వివాహం చేసుకుంది. 2016లో వీరిద్దరూ విడిపోయారు. అప్పటి నుండి తల్లిదండ్రులతోనే కలిసి ఉంటుంది. ఇప్పుడు తనను ఆ కుటుంబ సభ్యుల తీవ్రంగా కొట్టారంటూ వీడియోను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. అలాగే ఆమె దాడి కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. నటిపై ఫ్యామిలీ మెంబర్స్ దాడి చేయడం వెనుక కారణాలేమీ అయ్యింటాయని భావిస్తున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి

 

View this post on Instagram

 

A post shared by ℂ𝕀𝔻/ℂ𝕀𝔽 (@three_tigers_of_cid_394)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి