iDreamPost

పిల్లి మాంసం తిన్న గర్భిణీ..చివరకు ఏమైందంటే.!

ర్భిణీలు తినే ఆహారం..వారి కడుపులు పెరిగే బిడ్డపైన ప్రభావం చూపిస్తాయి. ఏ మాత్రం నిరక్ష్యంగా ఉన్నా.. తల్లిబిడ్డల ఆరోగ్యంపై ప్రభావాం చూపుతుంది. తాజాగా ఓ మహిళ పిల్లి మాంసం తిన్నడంతో ఘోరం జరిగింది.

ర్భిణీలు తినే ఆహారం..వారి కడుపులు పెరిగే బిడ్డపైన ప్రభావం చూపిస్తాయి. ఏ మాత్రం నిరక్ష్యంగా ఉన్నా.. తల్లిబిడ్డల ఆరోగ్యంపై ప్రభావాం చూపుతుంది. తాజాగా ఓ మహిళ పిల్లి మాంసం తిన్నడంతో ఘోరం జరిగింది.

పిల్లి మాంసం తిన్న గర్భిణీ..చివరకు ఏమైందంటే.!

మనం తినే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా..  ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది. అలానే ముఖ్యంగా గర్భిణీలు తినే ఆహారం..వారి కడుపులు పెరిగే బిడ్డపైన ప్రభావం చూపిస్తాయి. ఏ మాత్రం నిరక్ష్యంగా ఉన్నా.. తల్లిబిడ్డల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. తాజాగా ఓ మహిళా..తాను ప్రెగ్నెన్సీతో ఉన్న సమయంలో పిల్లి మాంసం తినింది. ఆ తరువాత జరిగిణ పరిణామానికి మనస్తాపానికి గురైంది. చివరకు ఏం జరిగిందో తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే.

ఫిలిప్పీన్స్‌కు చెందిన అల్మా అనే మహిళ తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. ఆమెకు జారెన్ గమోంగన్ అనే రెండేళ్ల కొడుకు ఉన్నాడు. అతడి ముఖం, శరీరం  అంతా కప్పి ఉంచేలా పెద్ద వెంట్రులకతో జన్మించాడు. జారెన్ జన్మించినప్పుడు అతడిని చూసి అల్మా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అలా శరీరమంతా పెద్దగా వెంట్రుకలు రావడాన్ని అరుదైన ‘వేర్‌వోల్ఫ్ సిండ్రోమ్’గా పిలుస్తారు. ఇలాంటి కేసులు ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 నుంచి 100 వరకు ఉన్నాయి.  అయితే జారెన్ కు అలా రావడానికి తన తల్లి అల్మా ఓ సందేహం వ్యక్తం చేసింది.

జారెన్‌ కడుపులో ఉండగా తల్లి అల్మాకు అడవి పిల్లులు తినాలనే కోరిక ఎక్కువగా ఉండేదట. దీంతో ఒక రోజు నల్లపిల్లిని తెచ్చుకుని వండుకుని తింది. ఆ సమయంలో అల్మాకు ఏమి అనిపించలేదు. కానీ జారెన్ పుట్టిన తరువాత అసలు విషయం అర్ధమైంది. తన కొడుకు ఓ ఎలుగుబంటి మాదిరిగా మెడ, వీపు, చేతులు, ముఖంపై జుట్టుతో ఉండటంతో ఎంతో బాధ పడింది. తాను ప్రెగ్నెన్సీగా ఉన్న సమయంలో నల్లపిల్లిని తినడం వల్లే తన కొడుకు ఇలా పుట్టాడని అల్మా బాధ పడింది. ఐతే అందుకు సరైన ఆధారాలు మాత్రం లేవు.

ఇది ఇలా ఉంటే అల్మాకు జారెన్ కంటే ముందు ఓ కుమార్తె జన్మించింది. ఆ పాపకు జారెన్ కు వచ్చిన  సిండ్రోమ్ రాలేదు. అయితే జారెన్ కి మాత్రమే ఈ అరుదైన పరిస్థితిని రావడంతో అల్మా మానసికంగా కుంగిపోతోంది. ప్రెగ్నెన్సీ సమయంలో తాను చేసిన పనికి నిందించుకుంటూ అల్మా విలపిస్తోంది. జారెన్‌కు అనేక వైద్య పరీక్షలు చేసి అతడు హైపర్‌ట్రికోసిస్ అనే అరుదైన వైద్య పరిస్థితితో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ హైపర్‌ట్రికోసిస్ అనేది సాధారణంగా మానవుడికి ఉండే జుట్టు కంటే అధికంగా ఏ భాగంలోనైనా పెరగొచ్చని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ డెర్మటాలజీ తెలిపింది.

ఇది అరుదైన వ్యాధి అని, దీనికి చికిత్స లేదని వైద్యులు తేల్చి చెప్పారు. తాను చాలా సార్లు జుట్టుని కత్తిరించడానికి ప్రయత్నించానని, అయితే అది పొడవుగా మందంగా ఉండటంతో కత్తిరించిన కొద్ది దట్టంగా పెరుగుతుందని చెప్పుకొచ్చింది. లేజర్ హెయిర్ రిమూవల్ వంటి ట్రీట్మెంట్స్ తో ఈ సమస్యను తగ్గించవచ్చని వైద్యులు సూచించారు. ఏదీ ఏమైనా ప్రెగ్నెన్సీ సమయంలో హానికరం అనిపించేవి తీసుకోకుండా ఉంటేనే కడుపులో ఉండే బిడ్డకు మంచిదని వైద్యలు తెలిపారు.  మరి.. ఈ వింత సమస్యపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి