iDreamPost

సిరి హన్మంతు గొడవపై స్పందించిన చిలసౌ స్రవంతి హీరో నంద కిిశోర్

బుల్లితెరలో ఎంతో మంది సీరియల్స్ ద్వారా అలరిస్తున్నారు. అయితే వీరిలో మహిళ అభిమానుల్నిచూరగొన్న హీరోల్లో ఒకరు నంద కిశోర్. ఏ సీరియల్ చేసినా..చాలా నెమ్మదస్తుడిగా, మంచివాడిగా కనిపిస్తుంటారు. చిలసౌ స్రవంతితో ఫేమస్ అయిన ఈ నటుడు తాజాగా..

బుల్లితెరలో ఎంతో మంది సీరియల్స్ ద్వారా అలరిస్తున్నారు. అయితే వీరిలో మహిళ అభిమానుల్నిచూరగొన్న హీరోల్లో ఒకరు నంద కిశోర్. ఏ సీరియల్ చేసినా..చాలా నెమ్మదస్తుడిగా, మంచివాడిగా కనిపిస్తుంటారు. చిలసౌ స్రవంతితో ఫేమస్ అయిన ఈ నటుడు తాజాగా..

సిరి హన్మంతు గొడవపై స్పందించిన చిలసౌ స్రవంతి హీరో నంద కిిశోర్

బుల్లితెరపై అలరించిన ధారావాహికల్లో ఒకటి చిలసౌ స్రవంతి. ఈ సీరియల్ చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెట్టుకున్న వాళ్లే. ఈ ధారావాహికలో స్రవంతిని భర్త పెట్టే కష్టాలు చూసి చలించిపోయారు ప్రేక్షకులు. 2006లో మొదలైన ఈ సీరియల్ 2011 వరకు వీక్షకులను అలరించింది. ఇందులో స్రవంతి పాత్రలో నటించారు మీనా వాసు. ఆమె శాడిస్టు భర్తగా మహేష్ పాత్రలో నటించారు యాక్టర్ భరణి. అలాగే భర్త నుండి ఆమెను విముక్తిని కలిగించే పాత్రలో కనిపిస్తారు నంద కిశోర్. ఈ సీరియల్‌కు ఆయనే హీరో. ఈ ధారావాహిక సూపర్ హిట్ కావడంతో.. శుభలేక, మంచు పల్లకి, శ్రీమతి కళ్యాణం, రామా సీత, రామసక్కని సీత వంటి సీరియల్లో నటించాడు. నితిన్ ద్రోణ అనే మూవీలో కూడా యాక్ట్ చేశారు.

23 ఏళ్ల నుండి బుల్లితెరపై ఏలుతున్న నంద కిశోర్.. సినిమాలు నిర్మించి..చేతులు కాల్చుకున్నారు. అప్పటి నుండి ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలాగే యాంకర్ సిరి హన్మంతుతో గొడవ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఈ బుల్లితెర సైలెంట్ హీరో. ‘థియేటర్ ఆర్టిస్టు నుండి బుల్లి తెరపైకి వచ్చాను. 2001-02లో స్వాతి అనే సీరియల్లో ఛాన్స్ వచ్చింది. సూర్యవంశం అనే సీరియల్ చేశా. అప్పట్లో బిజీగా మారిపోయా. అందుకే వెండితెరపై అవకాశాల కోసం ట్రై చేయలేకపోయా. నితిన్ ద్రోణ చేశా. అయితే లోపల మనస్సులో ఎక్కడో ఉండిపోయింది సినిమాలు చేయాలని. సినిమాలు చేస్తే చాలా పెద్ద రోల్ చేయాలని, వీలైతే హీరోగా చేయాలని అనుకున్నా. కానీ అవకాశం ఎప్పుడు రాలేదు. ఆ తర్వాత నేనే సొంత ప్రయత్నం చేశా’ అని చెప్పారు.

‘2021లో నరసింహ పురం అనే సినిమాను తెరకెక్కించాను. ఆ మూవీతో చేతులు కాల్చుకున్నాను. కమర్షియల్ హిట్ కాలేదు.. కానీ ఓ ప్రయత్నం.. నా వరకు నాకు ఇదొక చిన్న ప్రయత్నంగా భావించా. 2019-21లో విడుదలైంది. కరోనా వల్ల థియేటర్లకు ఎవ్వరూ రాలేదు. ఆ సినిమాలో సాంగ్స్ చాలా బాగుంటాయి. సంపాదించింది ఆ సినిమాకు పెట్టాను. వడ్డీలు తెచ్చి అప్పులు పాలయ్యాను. ప్లాన్ లేకపోవడం వల్లే.. కొత్తగా ప్రయత్నిద్దామని ఈ సినిమా తీశాను. ఆ సినిమా కోసం గుండు కూడా కొట్టించాను. సుమారు కోటి రూపాయలు నష్టపోయాను. ఈ మూవీ ప్లాప్ నుండి గుణపాఠం నేర్చుకున్నా’ అని తెలిపారు.

అలాగే సిరి హన్మంతుతో గొడవ గురించి మాట్లాడుతూ.. ‘నేను సిరిపై ఏ కామెంట్ చేయలేదు. కొన్ని ఛానల్స్ వేరే విధంగా రాసుకున్నారు. సిరి అప్పుడప్పుడే ప్రూవ్ చేసుకుంటుంది. నరసింహ పురం సినిమా కోసం కష్టపడి పనిచేసింది. అయితే ప్రమోషన్స్‌కు టైం కేటాయించలేదు. అదే చెప్పా. తన పర్సనల్‌ గా కానీ, యాక్టింగ్ స్కిల్స్ గురించి ఎప్పుడూ ఏం మాట్లాడలేదు. ఆమె వండర్ ఫుల్ యాక్టర్. ఆ ప్రాజెక్టులో బాగా పనిచేసింది.తనకు మేం అనుకున్నంత అమౌంట్ ఇవ్వలేదు. మూవీ నిర్మాణం లాస్‌లో వెళుతున్నట్లు అనిపించి.. ముందుగా అనుకున్న రెమ్యునరేషన్ ఆమెకు ఇవ్వలేకపోయాం. మంచి అమ్మాయి. కష్టపడి పనిచేసింది’ అని చెప్పారు. అలాగే టీవీ రంగంలో యాంకర్స్ మాత్రమే సక్సెస్ అయ్యారని చెప్పారు. వెంకటేశ్ తనను ఈ మూవీ ట్రైలర్ కోసం వెళితే.. మంచిగా రిసీవ్ చేసుకున్నారని తెలిపారు.

ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ.. తనకు ముగ్గురు అమ్మాయిలని చెప్పారు. భార్య లక్ష్మి, నిత్య, తన్మయి, రోహిణీ అనే ముగ్గురు అమ్మాయిలు ఉన్నారని చెప్పారు. వైఫ్ రైల్వే జాబ్ అని.. పిల్లల కోసం ఉద్యోగాన్ని వదిలేసిందని తెలిపారు. తనది లవ్ మ్యారేజ్ అని, పది తరగతి ప్రేమ అని.. ఐదేళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఉప్పెన సీరియల్‌లో నటిస్తున్నారు. అంతే కాకుండా తనకు ఎంతో పేరు తెచ్చిన స్రవంతి పార్ట్ 2 స్టార్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ సీరియల్ హీరో నటించిన ధారావాహికల్లో మీకు ఏదీ ఇష్టమో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి