iDreamPost

వీడియో: ప్రియుడిపై అలక.. ఏకంగా 150 అడుగుల టవర్‌ ఎక్కి..

వీడియో: ప్రియుడిపై అలక.. ఏకంగా 150 అడుగుల టవర్‌ ఎక్కి..

బంధం ఏదైనా కావచ్చు.. గొడవలు సర్వ సాధారణం. అది భార్యా, భర్తల బంధం కావచ్చు.. ప్రేమ బంధం కావచ్చు.. చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు జరగటం.. ఎవరో ఒకరు అలగటం మామూలుగా జరిగే తంతు. అయితే, కొన్ని సార్లు ఆ అలిగిన మనిషి.. తమ ఉనికిని చాటు కోవటానికి లేదా.. తమ పంతం నెగ్గించుకోవటానికి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. తాజాగా, ఓ యువతి తన ప్రియుడిపై అలిగి ఏకంగా.. 150 అడుగుల టవర్‌ ఎక్కేసింది. ఆ టవర్‌పైనుంచి దూకుతానంటూ బెదిరింపులకు పాల్పడింది.

ఈ సంఘటన ఛత్తీష్‌ఘర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఛత్తీష్‌ఘర్‌లోని గౌరేలా-పెంద్రా- మార్వాహికి చెందిన అనిత భైనా.. కొడ్గర్‌ గ్రామానికి చెందిన ముఖేష్‌ గత కొంత కాలంగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఆమె ప్రియుడి దగ్గరకు వెళ్లిపోయింది. అతడి ఇంట్లోనే ఉంటోంది. గురువారం ఏదో విషయంలో ప్రియుడికి, ప్రియురాలికి మధ్య గొడవైంది. ఆ గొడవ చినికి, చినికి గాలి వానలా తయారైంది. ఈ నేపథ్యంలోనే ప్రియురాలు ఆగ్రహావేశానికి గురైంది. ప్రియుడిమీద కోపంతో అనిత అక్కడినుంచి వెళ్లిపోయింది. ప్రియుడు ఎంత బతిమాలుతున్నా ఆమె ఆగలేదు.

ఇంట్లోంచి నేరుగా ఊరి బయటకు వెళ్లింది. అక్కడ ఉన్న టవర్‌ ఎక్కింది. ఆమెపై అనుమానం వచ్చిన ముఖేష్‌ వెనకాలే వెళ్లాడు. టవర్‌ ఎక్కిన ఆమెను బతిమాలాటం మొదలుపెట్టాడు. దాదాపు అరగంట పాటు ఆమె టవర్‌పైనే ఉండిపోయింది. అలక తీరిన తర్వాత మెల్లగా కిందకు వచ్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రముఖ వ్యాపార వేత్త హర్ష గోయెంక తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ‘‘ మేము ఏళ్లుగా ట్రాన్స్‌మిషన్‌ టవర్లను నిర్మిస్తున్నాము. సూసైడ్‌ చేసుకోవటానికి ఈ టవర్‌ ఎక్కటం ఇదే మొదటి సారి. శుభవార్త ఏంటంటే.. ప్రియుడు ఆమెను బతిమాలి కిందకు వచ్చేలా చేశాడు’’ అని రాసుకొచ్చారు. ఆ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ప్రియుడిపై అలకతో టవర్‌ ఎక్కిన మహిళ ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి